బిగ్ బాస్ హారికకు పెళ్లైపోయిందా.. నిజమేమిటంటే..?  

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ముగింపుకు కేవలం నాలుగు వారాలే ఉందనే సంగతి తెలిసిందే.అభిజిత్ విన్నర్ అవుతాడని వార్తలు వైరల్ అవుతున్నా బిగ్ బాస్ షోలో ఎవరు విన్నర్ అవుతారో ఎవరు ఎలిమినేట్ అవుతారో అంచనా వేయడం సులభం కాదని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

TeluguStop.com - Bigg Boss Contestant Harika Mother Clarifies Harika Marriage Rumours

మరోవైపు రోజులు గడిచే కొద్దీ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సంబంధించిన కొత్త విషయాలు బయటపడుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ షోలో హారిక తాను నాలుగున్నరేళ్లు ఒక వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పడంతో హారికకు పెళ్లైపోయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

TeluguStop.com - బిగ్ బాస్ హారికకు పెళ్లైపోయిందా.. నిజమేమిటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి హారిక తల్లి జ్యోతిక స్పందించి స్పష్టతనిచ్చారు. హారికకు పెళ్లి జరిగిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని హారిక ఫ్యాన్స్ వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని సూచనలు చేశారు.

హారిక బ్రేకప్ జరిగి రెండు సంవత్సరాలు అవుతోందని ఆ బ్రేకప్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జ్యోతిక చెప్పారు.అభిజిత్ హారిక మధ్య ఏదో ఉందని వస్తున్న వార్తల గురించి స్పందిస్తూ వాళ్లు మంచి స్నేహితులని అనుకుంటున్నామని.వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే పెళ్లి చేయడానికి కూడా తమకు అభ్యంతరం లేదని జ్యోతిక చెప్పారు.ఎవరో కావాలని హారిక పెళ్లి పుకార్లను పుట్టిస్తున్నారని అన్నారు.

హారిక అన్నయ్య వంశీ కార్తీక్ అభిజిత్ హారికలది తమకు ప్యూర్ ఫ్రెండ్ షిప్ లానే అనిపిస్తోందని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన నోయల్ సైతం వాళ్లది ఫ్రెండ్ షిప్ అనే చెప్పాడని.ఒకవేళ అభిజిత్ హారిక మధ్య ఉన్నది లవ్వే అయితే అభిజిత్ వాళ్ల కుటుంబానికి అభ్యంతరం లేకపోతే పెళ్లికి తమకు కూడా ఓకే అని చెప్పారు.

#Abhijeet #Love Track #HarikaMother #Mother Jyothika #DethadiHarika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Bigg Boss Contestant Harika Mother Clarifies Harika Marriage Rumours Related Telugu News,Photos/Pics,Images..