బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 మొదట్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ ఇస్తున్న మంచి టాస్కులు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో ముగింపుకు మరో మూడు వారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ తెస్తున్న కొత్త నిబంధనలు కంటెస్టెంట్లను అవాక్కయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.
బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ షో సీజన్ 4 కు హారిక చివరి కెప్టెన్ అని.ఇకపై హౌస్ కు కెప్టెన్ ఉండరని వెల్లడించారు.12వ వారం కెప్టెన్ గా ఉన్న హారికకు కెప్టెన్ బ్యాండ్ ను తీసివేయాలని బిగ్ బాస్ సూచించారు.దీంతో ఇకపై బిగ్ బాస్ లో కెప్టెన్ ఉండరు.
ఫలితంగా రాబోయే మూడు వారాల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ లభించదు.హౌస్ లో ఇతర కంటెస్టెంట్లు నామినేట్ చేయకపోతే సేవ్ అయ్యే అవకాశం ఉంది కానీ ప్రతి కంటెస్టెంట్ ఎలిమినేషన్ రిస్క్ లో ఉన్నట్టే అని చెప్పాలి.
బిగ్ బాస్ నిర్వాహకులు గత సీజన్లలా ఆశించిన స్థాయిలో టీఆర్పీ రేటింగులు రాకపోవడంతో రాబోయే మూడు వారాలు కొత్తకొత్త టాస్కులు, అంచనాలకు అందని ట్విస్టులతో బిగ్ బాస్ షోను మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.రేస్ టు ఫినాలే మొదలుకావడంతో ఇకపై మూడు వారాలు ఎవరు జాగ్రత్తగా ఉంటారో వాళ్లు మాత్రమే బిగ్ బాస్ షోకు విన్నర్ అయ్యే అవకాశం ఉంది.
అభిజిత్ విన్నర్ అని వార్తలు వస్తున్నా షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నాటికి ఏదైనా జరగొచ్చని తెలుస్తోంది.హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉండటంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.
బిగ్ బాస్ సీజన్ 4 లో ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారో చూడాల్సి ఉంది.