బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులతో గంగవ్వ ఏం చేసిందంటే..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించిన కంటెస్టెంట్ ఎవరంటే గంగవ్వ అనే చెప్పాలి.ఆరోగ్య సమస్యల వల్ల బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ బయటకు వచ్చినా హౌస్ లో ఉన్నన్ని రోజులు గంగవ్వ అందించిన ఎంటర్టైన్మెంట్ అంతాఇంతా కాదు.

 Bigg Boss Contestant Gangavva Shopping Photos Goes Viral In Social Media, Bigg B-TeluguStop.com

మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన గంగవ్వ ఆ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకుంది.

హౌస్ లో కొన్ని వారాలే ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకుంది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ పాల్గొన్న సమయంలోనే పల్లెటూరి వాతావరణంలో పెరిగిన గంగవ్వకు బిగ్ బాస్ షో సూట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే ఇల్లు కట్టుకోవాలనే కోరికతో బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిన గంగవ్వ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో నాగార్జునను తనకు ఇల్లు కట్టివ్వాలని కోరింది.

Telugu Biggboss, Bigg Boss Show, Gangavva, Gold-Movie

నాగార్జున సైతం గంగవ్వకు తాను ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చాడు.కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ నిర్వాహకులు గంగవ్వకు రెమ్యునరేషన్ కు సంబంధించిన చెక్కులను ఇచ్చారు.బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులతో గంగవ్వ షాపింగ్ చేసి బంగారం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.గంగవ్వ బంగారు ఆభరణాలు వేసుకుని దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరోవైపు గంగవ్వ నాగార్జున కట్టిస్తానన్న ఇంటి గురించి కూడా స్పష్టతనిచ్చింది.

త్వరలో ఇంటి నిర్మాణం జరగబోతుందని గంగవ్వ వెల్లడించింది.

త్వరలో నాగార్జున కట్టిస్తున్న ఇల్లు గురించి ఒక వీడియో చేస్తానని గంగవ్వ ప్రకటించింది.మరోవైపు బిగ్ బాస్ షో నుంచి గంగవ్వ బయటకు వెళ్లిన తరువాత ఆమెను చూడటానికి లంబాడిపల్లెకు ప్రముఖులు, సామాన్యులు క్యూ కట్టడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube