మారిపోయిన గంగవ్వ.. బిగ్ బాస్ విన్నర్ అతనేనంట..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది.మరో నాలుగు వారాల్లో ఈ షో పూర్తి కానుండటంతో ఈ సీజన్ కు ఎవరు విన్నర్ అవుతారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.

 Bigg Boss Contestant Gangavva Abotu Bigg Boss Show Winner,bigg Boss,gangavva-TeluguStop.com

గత సీజన్లలో అంచనాలకు భిన్నంగా పెద్దగా పాపులారిటీ లేని కంటెస్టెంట్లే విన్నర్లు అయిన సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో అభిజిత్ విన్నర్ అవుతాడని లాస్య రన్నర్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.

తాజాగా బిగ్ బాస్ షో నుంచి అనారోగ్య సమస్యల వల్ల బయటకు వచ్చిన గంగవ్వ అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ కావచ్చంటూ కామెంట్లు చేసింది.గంగవ్వ అలా చెప్పడంలో తప్పేం లేకపోయినా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సమయంలో ఒకలా, ప్రస్తుతం మరోలా అభిజిత్ గురించి గంగవ్వ కామెంట్లు చేయడం గమనార్హం.

ఎలిమినేట్ అయిన సమయంలో గంగవ్వ అఖిల్ అంటే ఇష్టమని చెప్పడంతో పాటు అవినాష్ విన్నర్ కావచ్చంటూ కామెంట్లు చేసింది.

అభిజిత్ ఇంట్లో ఖాళీగా ఉంటాడంటూ కామెంట్లు చేసిన గంగవ్వ ఇప్పుడు అతనే విన్నర్ గా నిలుస్తాడని చెబుతుండటం గమనార్హం.

అయితే సోషల్ మీడియాలో బిగ్ బాస్ ప్రేక్షకులు మాత్రం అభిజిత్ విన్నర్ అంటూ జరుగుతున్న ప్రచారం వట్టిదేనని అభిజిత్ విన్నర్ కావడం జరగదని చెబుతున్నారు.అభిజిత్ హౌస్ లో బిగ్ బాస్ ఇస్తున్న టాస్కుల్లో సరిగ్గా పాల్గొనడం లేదు.,

షో ముగియడానికి తక్కువ సమయం ఉండటంతో ఇకపై టాస్కులు కూడా గతంతో పోలిస్తే కఠినంగా ఉంటాయి.ఇలాంటి సమయంలో అభిజిత్ టాస్కుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయకపోయినా విన్నర్ కాలేడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడో లేక మరో కంటెస్టెంట్ అవుతారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube