దేవి నాగవల్లికి ఆ సీనియర్ దర్శకుడు బంధువు అవుతాడంట…  

big boss contestant Devi nagavalli is relative to the Former Senior director Dasari narayana rao, Devi nagavalli big boss season 4 contestant, TV9, Journalist, News reader, Dasari narayana rao, Former Senior director, Tollywood, - Telugu Big Boss Contestant Devi Nagavalli Is Relative To The Former Senior Director Dasari Narayana Rao, Dasari Narayana Rao, Devi Nagavalli Big Boss Season 4 Contestant, Former Senior Director, Journalist, News Reader, Tollywood, Tv9

ప్రముఖ తెలుగు వార్త ఛానల్ అయినటువంటి టీవీ9 లో న్యూస్ రీడర్ గా పని చేస్తున్న ప్రముఖ జర్నలిస్టు దేవి నాగవల్లి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు.అయితే ఇటీవలే మొదలైన ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 4వ సీజన్లో జర్నలిస్ట్ నాగవల్లి కంటెస్టెంట్ గా పాల్గొంది.

TeluguStop.com - Bigg Boss Contestant Devi Nagavalli Is Relative To The Former Senior Director Dasari Narayana Rao

ఇందులో భాగంగా దేవి నాగవల్లి స్కిట్లు, డాన్సులతో ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.అయితే తాజాగా దేవి నాగవల్లి తల్లి సత్యవతి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఇందులో భాగంగా దేవి నాగవల్లి గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంది.

ఇందులో భాగంగా తన భర్త 2006 సంవత్సరంలో చనిపోయాడని ఇక అప్పటినుంచి దేవి నాగవల్లి ఉద్యోగం చేస్తూ  కుటుంబ బాధ్యతలను తన భుజంపై వేసుకుని మోస్తోందని తెలిపింది. అంతేగాక ఒకప్పుడు తన తండ్రి చేసినటువంటి అప్పుల కారణంగా తన సొంత ఊర్లో ఉన్నటువంటి ఇల్లుని అమ్మేశారని ఆ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వచ్చి దేవి నాగవల్లి ఉద్యోగం చేయగా వచ్చినటువంటి డబ్బుతో కుటుంబాన్ని పోషించేదని కొంతమేర ఎమోషనల్ అయ్యింది.

TeluguStop.com - దేవి నాగవల్లికి ఆ సీనియర్ దర్శకుడు బంధువు అవుతాడంట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాగే దేవి నాగవల్లి మంచితనం గురించి కూడా వివరిస్తూ వారింట్లో పని చేసినటువంటి సిబ్బందిలో ఓ మహిళ కూతురికి వివాహం చేయడానికి ఇబ్బందులు పడుతుంటే 50 వేల రూపాయలు ఇచ్చిందని, అంతేకాక ప్రతి సంవత్సరం తనవంతుగా ఓ అనాథ ఆర్గనైజేషన్ కి దాదాపుగా లక్ష రూపాయలు పంపిస్తుందని, ఇలా చాలా రకాలుగా సహాయాలు చేస్తుందని తెలిపింది.ప్రస్తుతం దేవి నాగవల్లి కి ఒక బాబు ఉన్నాడని, అలాగే దేవి నాగవల్లి అన్నయ్యలు హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

ఇక దేవి నాగవల్లి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయంపై స్పందిస్తూ తనకి దేవి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఖచ్చితంగా దేవి నాగవల్లి విజేతగా నిలుస్తుందని తనకు నమ్మకం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.అంతేగాక ఆమెకి పోరాడేటువంటి లక్షణాలు మెండుగా ఉన్నాయని కాబట్టి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగల సామర్థ్యం ఆమెకు ఉందని తెలిపింది.

అలాగే  ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో దేవి నాగవల్లి కి ప్రముఖ సింగర్ మరియు నటుడు నోయల్ బాగా పోటీ ఇస్తున్నాడని మిగిలిన వాళ్లు కూడా తమదైన శైలిలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారని చెప్పుకొచ్చింది.అలాగే తెలుగులో ఒకప్పుడు పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన స్వర్గీయ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణ రావు తమకు బంధువు అవుతారని కానీ ఎప్పుడూ కూడా వారి సహాయాన్ని తీసుకోలేదని, కానీ అప్పుడప్పుడు పండుగలు, లేదా ఇతర కార్యాల సమయంలో కలుస్తుంటామని తెలిపింది.

#DeviNagavalli #BigBoss #FormerSenior #Journalist #DasariNarayana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Contestant Devi Nagavalli Is Relative To The Former Senior Director Dasari Narayana Rao Related Telugu News,Photos/Pics,Images..