అవినాష్ కు బంపర్ ఆఫర్.. ఆ కామెడీ షోలో ఛాన్స్..?

జబర్దస్త్ షో ద్వారా అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో అవినాష్ ఒకరు.మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన అవినాష్ మొదట జబర్దస్త్ లోని పలు టీమ్ లలో పని చేసి లక్ కలిసి రావడంతో టీమ్ లీడర్ గా ఎదిగారు.

 Bigg Boss Contestant Avinash Gets Bomma Adirindi Show Offer, Bomma Adirindi Show-TeluguStop.com

అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అవినాష్ బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టిన తరువాతే ఆయన వ్యక్తిగత విషయాల గురించి, ఇతర విషయాల గురించి ప్రేక్షకులకు తెలిసింది.

అవినాష్ బిగ్ బాస్ షోలోకి రావడానికి జబర్దస్త్ నిర్వాహకులకు 10 లక్షల రూపాయలు చెల్లించారని సమాచారం.

అయితే జబర్దస్త్ షో నిర్వాహకులు మాత్రం బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత షోలోకి తీసుకోబోమని చెప్పారని అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో చెప్పారు.బిగ్ బాస్ హౌస్ లో కామెడీ చేస్తూ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న అవినాష్ ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ప్రతిసారి ఎలిమినేట్ అవుతానని ఎలిమినేట్ అయితే అప్పులు తీర్చడం కష్టమని టెన్షన్ పడుతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో అరియానా గ్లోరీతో అవినాష్ నడుపుతున్న లవ్ ట్రాక్ కూడా అతనికి ప్లస్ అవుతోంది.అయితే బిగ్ బాస్ షో నుంచి అవినాష్ బయటకు వచ్చిన తరువాత అతనికి బొమ్మ అదిరింది షోలో అవకాశం దక్కనుందని సమాచారం.

మెగాబ్రదర్ నాగబాబు అవినాష్ కు ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న బొమ్మ అదిరింది షోలో అవినాష్ కంటెస్టెంట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Telugu Avinash, Avinash Career, Biggboss, Bommaadirindi, Jabardast Show, Jabarda

జబర్దస్త్ షో స్థాయిలో కాకపోయినా బొమ్మ అదిరింది షో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.అందువల్ల బొమ్మ అదిరింది షోలో అవినాష్ కు ఛాన్స్ వస్తే మాత్రం కమెడియన్ గా అతని కెరీర్ కు ఎటువంటి ఇబ్బందులు ఉండవనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube