పెళ్లి చేసుకోమని అడిగిన అవినాష్.. అరియానా ఏమందంటే..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే.గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ సీజన్ 4 లో పెద్దగా ఫేమస్ కాని సెలబ్రిటీలే పాల్గొనగా బిగ్ బాస్ షో ద్వారా వారికి ఊహించని స్థాయిలో పాపులారిటీ సొంతమైంది.

 Bigg Boss Contestant Avinash Asks Ariyana To Marry In Live Show , Avinash, Ariya-TeluguStop.com

అలా బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకుల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న సెలబ్రిటీలలో అరియానా ఒకరు.
బిగ్ బాస్ షోకు ముందు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఫేమస్ అయిన అరియానా బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు అద్భుతంగా ఆడి టాప్ 4 కంటెస్టెంట్ గా నిలిచారు.

బిగ్ బాస్ హౌస్ లో ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే అవినాష్ తో అరియానా సన్నిహితంగా ఉండేవారు.బిగ్ బాస్ షోలోని అవినాష్ అరియానా మధ్య ఏదో ఉందని వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా అరియానా ఒక టీవీ ఛానల్ లో ఇంటర్య్వూకు గెస్ట్ గా హాజరయ్యారు.

Telugu Ariyana, Ariyana Glory, Avinash, Avinash Prank, Biggboss, Bigg Boss, Live

ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో అవినాష్ కాల్ చేసి తన పేరు చెప్పకుండా అరియానాకు తాను పెద్ద ఫ్యాన్ నని చెప్పారు.ఆ తరువాత అవినాష్ అరియానాను పెళ్లెప్పుడు చేసుకుందామని అడిగారు.అవినాష్ అలా అడగటంతో అరియానా అవాక్కయింది.

అయితే వెంటనే అవినాష్ పెళ్లి వేరువేరుగా చేసుకుందాం అని చెప్పింది.అయితే అవినాష్ ను గుర్తుపట్టని అరియానా అతని పెళ్లి కామెంట్ల గురించి స్పందించలేదు.
ఆ తరువాత యాంకర్ కాల్ చేసిన వ్యక్తి అవినాష్ అని చెప్పడంతో ఆశ్చర్యపోయిన అరియానా అవినాష్ తో కలిసి ప్రోగ్రామ్ చేసే అవకాశం వస్తే తాను వదులుకోనని అన్నారు.అరియానా, అవినాష్ లతో స్టార్ మా ఒక కామెడీ ప్రోగ్రామ్ ను ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube