అరియానాతో పెళ్లిపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలేకు కేవలం 7 రోజులు మాత్రమే ఉంది.చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు గ్రాండ్ ఫినాలేకు గెస్టులుగా వినిపిస్తున్నా స్టార్ మా ఛానెల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 Bigg Boss Contestant Avinash  Comments About Ariyana Glory,  Avinash, Ariyana Gl-TeluguStop.com

అభిజిత్, సోహైల్, అఖిల్, హారిక, అరియానా గ్లోరీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా నిలవగా సెలబ్రిటీలు, బిగ్ బాస్ 4లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సోషల్ మీడియా ద్వారా తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించడం కోసం కష్టపడుతున్నారు.

బిగ్ బాస్ షో నుంచి 13వ వారం ఎలిమినేట్ అయిన అవినాష్ సోషల్ మీడియాలో లైవ్ ద్వారా అభిమానులతో మాట్లాడుతూ అరియానాను గెలిపించాలని కోరారు.

కొన్ని రోజులుగా ఇతర కార్యక్రమాలతో, పనులతో బిజీగా ఉండటం వల్ల లైవ్ లోకి రావడానికి కొంత ఆలస్యమైందని అభిమానులకు తెలిపారు.బిగ్ బాస్ షోలో తాను విన్ కాలేకపోయినా ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం తాను విన్ అయ్యానని అవినాష్ వ్యాఖ్యలు చేశారు.

Telugu Ariyana Glory, Avinash, Avinash Live, Bb Telugu, Biggboss, Bigg Boss, Rum

చాలామంది బిగ్ బాస్ సీజన్ 4 ఎపిసోడ్లను చూశారా.? లేదా.? అని అడుగుతున్నారని అయితే తాను ఇప్పటివరకు బిగ్ బాస్ ఎపిసోడ్లను చూడలేదని త్వరలోనే చూస్తానని అవినాష్ తెలిపారు. టాప్ ఫైవ్ 5 కంటెస్టెంట్లలో తాను కూడా ఉంటానని భావించినా ఎలిమినేట్ అయ్యానని అరియానాను విన్నర్ గా చూడాలనుకుంటున్నానని తెలిపారు.

హౌస్ లో ఒకరి గురించి మరొకరం ఆలోచించే వాళ్లమని ఎలిమినేట్ అయ్యాక తాను అరియానాను చాలా మిస్ అవుతున్నానని అవినాష్ అన్నారు.

Telugu Ariyana Glory, Avinash, Avinash Live, Bb Telugu, Biggboss, Bigg Boss, Rum

చాలామంది తను, అరియానా సన్నిహితంగా మెలగడంతో పెళ్లి చేసుకోమని చెబుతున్నారని అయితే అరియానా తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని అన్నారు.బిగ్ బాస్ హౌస్ లో అరియానా సింగిల్ గా ఎంతో కష్టపడి ఆడుతోందని ఆమెను గెలిపించాలని కోరారు.మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ దేవి నాగవల్లి సైతం ఈ సీజన్ లో లేడీ కెంటెస్టెంట్ విన్నర్ కావాలని చెబుతూ అరియానాకు తాను సపోర్ట్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube