లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న అషురెడ్డి.. కారణమిదే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న పవన్ కళాణ్ కు సామాన్యులతో పాటు సెలబ్రిటీలలో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నితిన్ పవన్ కళ్యాణ్ ను ఎంతో అభిమానిస్తారు.

 Bigg Boss Contestant Ashu Reddy Emotional Comments On Pawan Kalyan-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా అభిమానుల్లో గుర్తింపును సంపాదించుకున్న అషురెడ్డి సైతం పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అనే సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ కరోనా నిర్ధారణ అయిందని తెలిసి అషురెడ్డి లైవ్ లో ఎమోషనల్ అయ్యారు.

 Bigg Boss Contestant Ashu Reddy Emotional Comments On Pawan Kalyan-లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న అషురెడ్డి.. కారణమిదే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టిక్ టాక్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.ఒక ప్రముఖ సింగర్ తో అషురెడ్డి డేటింగ్ ఉన్నారంటూ సోషల్ మీడియాలోవార్తలు వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ కు కరోనా సోకడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అషురెడ్డి వీడియోలో కోరారు.

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అషురెడ్డి తెలిపారు.త్వరలోనే పవన్ పూర్తి ఆరోగ్యంగా ప్రజల ముందుకు వస్తారని ఆమె ఆకాంక్షించారు. కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందని అషురెడ్డి అన్నారు.

మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అభిమానులకు అషురెడ్డి సూచనలు చేశారు.మిమ్మల్ని నమ్ముకుని కుటుంబాలు ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలని అషురెడ్డి పేర్కొన్నారు.

అషురెడ్డి షేర్ చేసిన వీడియోకు కొందరు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెటిజన్లు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం పవన్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం గమనార్హం.

పవన్ త్వరగా కోలుకోవాలని కొందరు అభిమానులు గుడికి వెళ్లి పూజలు చేస్తున్నారు.పవన్ కు కరోనా సోకడంతో ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి.

#Emotional Video #Ashureddy #Speedy Recovery #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు