బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని బోలెడంత పాపులారిటీని సంపాదించుకున్నారు అషురెడ్డి.టిక్ టాక్ వీడియోల ద్వారా అషురెడ్డికి జూనియర్ సమంత అనే పేరు ఉండటంతో సమంత ఫ్యాన్స్ లో కొంతమంది అషురెడ్డిని అభిమానిస్తారు.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన అషురెడ్డి పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పై తనకు ఉన్న అభిమానాన్ని చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో ఏఎం రత్నం నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.పవన్ కళ్యాణ్ ఒకవైపు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తూనే మరోవైపు క్రిష్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు.
పవన్ తన ఫస్ట్ లవ్ అని చెప్పే అషురెడ్డి క్రిష్ సినిమా షూటింగ్ లో పవన్ ను కలుసుకున్నారు.
పవన్ కళ్యాణ్ తో దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నేడు తన దేవుడు పవన్ కళ్యాణ్ ను కలిశానని.పవన్ పేరుతో తాను వేయించుకున్న టాటూ పవన్ కు గుర్తుందని ఆమె చెప్పారు.పవన్ కళ్యాణ్ తన చేతి వ్రాతతో రాసిన లెటర్ ను తనకు ఇచ్చారని ఆమె లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పవన్ కళ్యాణ్ ను కలిసే ఛాన్స్ ఇచ్చినందుకు దర్శకుడు క్రిష్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
పవన్ లెటర్ ను సోషల్ మీడియాలో చూసిన ఒక నెటిజన్ పవన్ కు నాలుగో భార్యగా ఉండే ఛాన్స్ మీకు వస్తే అంగీకరిస్తారా.? అని ప్రశ్నించాడు.ఆ ప్రశ్నకు అషురెడ్డి కూల్ గా యస్ అంటూ సమాధానం ఇచ్చి అభిమానులను అవాక్కయ్యేలా చేశారు.
నెటిజన్ ప్రశ్నకు అషురెడ్డి యస్ అంటూ చేసిన కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.