లవ్ ట్రాక్ పై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి.. అతనిని అన్నయ్యా అంటూ..?

ఈ మధ్య కాలంలో బుల్లితెర జోడీల లవ్ ట్రాకులతో నిర్మాతలు కామెడీ షోలు, రియాలిటీ షోలను హిట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ లవ్ ట్రాకుల వల్ల ఆ షోలు హిట్ అవుతున్నా సెలబ్రిటీలకు మాత్రం కొత్త తలనొప్పులు వస్తున్నాయి.

 Bigg Boss Contestant Ashu Reddy Clarity About Love Track With Express Hari , As-TeluguStop.com

ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియాలో వాళ్లకు ఈ లవ్ ట్రాక్ కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదురవుతున్నాయి.అషురెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్స్ ప్రెస్ హరితో కలిసి ఎక్కువగా స్కిట్లు చేస్తున్నారు.

అయితే గత కొన్ని రోజుల నుంచి అషురెడ్డి, ఎక్స్ ప్రెస్ హరి మధ్య లవ్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.అషురెడ్డి, యాంకర్ రవితో కలిసి హ్యాపీడేస్ పేరుతో ఒక ప్రోగ్రామ్ చేస్తుండగా త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ షో గురించి అషురెడ్డి సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించారు.

ఈ లైవ్ చాట్ లో ఎక్స్ ప్రెస్ హరి గురించి మాట్లాడుతూ లవ్ ట్రాక్ గురించి స్పష్టతనిచ్చారు.ఎక్స్ ప్రెస్ హరి తనకు అన్నయ్య లాంటి వ్యక్తి అని ఆమె అన్నారు.

Telugu Anchor Ravi, Ashureddy, Ashu Reddy, Ashu, Stars Show, Etv, Express Hari,

కామెడీ స్టార్స్ షో కొరకు అలా చేస్తున్నామని రియల్ లైఫ్ లో బ్రదర్ అండ్ సిస్టర్ లా ఎక్స్ ప్రెస్ హరి, తాను ఉంటామని అషురెడ్డి తెలిపారు.డైరెక్టర్ చెప్పడం వల్లే కామెడీ స్టార్స్ షోలో సన్నిహితంగా ఉన్నామని అషురెడ్డి చెప్పారు.ఎక్స్ ప్రెస్ హరితో లవ్ లో ఉన్నట్టు వస్తున్న వార్తలకు అషురెడ్డి చెక్ పెట్టేశారు.మరోవైపు రవితో అషురెడ్డి చేస్తున్న హ్యాపీడేస్ షో ఈటీవీ ప్లస్ ఛానల్ లో హోలీ పండుగ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రవితో కలిసి అషురెడ్డి చేసిన ఈ షో హిట్ అయితే మాత్రం అషురెడ్డి యాంకర్ గా బిజీ అయ్యే అవకాశం ఉంది.గతంలో ఈటీవీ ప్లస్ ఛానల్ లో హిట్ అయిన పటాస్ షో తరహాలో ఈ షో ఉండనుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube