బిగ్ బాస్ తరువాత అరియానా సన్యాసం తీసుకోబోతుందా..?

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేనివాళ్లకు సైతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు దక్కుతోంది.బిగ్ బాస్ షో సీజన్ 4 ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో అరియానా గ్లోరీ ఒకరు.

 Bigg Boss Contestant Ariyana Glory Become A Nun, Bigg Boss Contestant Ariyana,ar-TeluguStop.com

బిగ్ బాస్ ప్రేక్షకుల్లో చాలామంది అరియానా మొదటి మూడు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందని భావించినా ఊహించని విధంగా ఆమె స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా మారారు.
ప్రేక్షకుల్లో చాలామంది ఆమె టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా ఉంటారని.

విన్నర్ అయ్యే అవకాశం లేకపోయినా రన్నర్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.అయితే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత అరియానా సన్యాసం తీసుకోబోతుందని గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Telugu Ariyana Glory, Ariyana Nun, Ariyana Sister, Ariyanasister, Ariyana Tasks,

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి అరియానా సోదరి నైనా స్పందించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.అరియానా సన్యాసం తీసుకుంటానని అప్పుడప్పుడూ తనతో, ఆమె స్నేహితులతో చెబుతూ ఉంటుందని అయితే తను సరదా కోసమే ఆ విధంగా చెబుతుందని తాను అనుకుంటున్నానని తెలిపారు.ప్రేక్షకులు అరియానాను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని అక్క విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని నైనా తెలిపారు.

Telugu Ariyana Glory, Ariyana Nun, Ariyana Sister, Ariyanasister, Ariyana Tasks,

అక్క దేవుని కంటే హ్యుమానిటీని నమ్ముతుందని.ఇతరులకు సాయం చేస్తే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులు సాయం చేస్తారని విశ్వసిస్తుందని నైనా చెప్పారు.అక్క విన్నర్ కాకపోతే అభిజిత్, అవినాష్, సొహైల్ లలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే అవకాశం ఉందని నైనా అన్నారు.

టాస్కుల్లో నూటికి నూరు శాతం ఇస్తున్న అరియానా విన్నర్ లేదా రన్నర్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube