అన్ని చోట్ల అన్యాయమే.. అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

బిగ్ బాస్ సీజన్ 4 లో మోనాల్ తో లవ్ ట్రాక్ నడపడంతో ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా బిగ్ బాస్ సీజన్ 4 రన్నరప్ గా అఖిల్ సార్థక్ నిలిచారు.ప్రేక్షకులు అభిజిత్ విన్నర్ అవుతాడని సోహెల్ రన్నర్ అవుతాడని భావించగా సోహెల్ 25 లక్షల రూపాయలు తీసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి క్విట్ కావడంతో అఖిల్ రన్నరప్ అయ్యాడని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Bigg Boss Contestant Akhl Sarthak Reveals His Life Secrets, 50000 Rupees, Akhil-TeluguStop.com

అయితే అఖిల్ కొన్ని సీరియళ్లలో నటించినా అతని గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న అఖిల్ తన జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

బాల్యం నుంచే తనకు సెలబ్రిటీ కావాలని కోరిక ఉండేదని అఖిల్ తెలిపారు.అందంగా కనిపించాలనే ఉద్దేశంతో కొన్ని చికిత్సలు కూడా చేయించుకున్నానని తెలిపారు.అవకాశాల కోసం ఇంటినుంచి బయటకు వచ్చిన తరువాత తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలు అప్పు చేశానని అన్నారు.

Telugu Rupees, Akhil Sarthak, Biggboss, Reveals Secrets-Movie

తాను సీరియళ్లలో నటిస్తున్న సమయంలొ యాడ్ లలో నటించే ఆఫర్లు కూడా వచ్చాయని.అయితే కొందరు తొక్కేయడం వల్ల ఆ అవకాశం చేజారిపోయిందని.తనకు ప్రతిచోట అన్యాయమే జరిగిందని అన్నారు.

ఒక అమ్మాయిని ప్రేమించానని కానీ కులం వల్ల బ్రేకప్ జరిగిందని అఖిల్ అన్నారు.మోనాల్, సోహెల్ తో కలిసి న్యూ ఇయర్ పార్టీని జరుపుకున్న అఖిల్ సంక్రాంతి పండుగ నాటికి శుభవార్త చెబుతానని అన్నారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని అయితే ఓకే అయిన తరువాతే పూర్తి వివరాలను ప్రకటిస్తానని అన్నారు.సంక్రాంతిలోపు ఒకేసారి కొన్ని ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube