మోనాల్ కు అఖిల్ ఝలక్.. అవాక్కైన ప్రేక్షకులు..?

గత కొన్ని వారాల నుంచి బోరింగ్ గా సాగుతోన్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి.నిన్నటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా మోనాల్ ను అఖిల్ నామినేట్ చేయడం హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది.

 Bigg Boss Contestant Akhil Gave Shock To Monal Gajjar, Monal Gajjar, Bigg Boss H-TeluguStop.com

నిన్నటి ఎపిసోడ్ లో అఖిల్ మోనాల్ కు కొంచెం దూరంగా ఉండటంతో ఆమె అఖిల్ ను ఎందుకు దూరంగా ఉంటున్నావని ప్రశ్నించింది.అఖిల్ తానేం దూరంగా లేనని చెప్పడంతో మోనాల్ తనకు హగ్ ఇవ్వాలని అడిగింది.
అఖిల్ హగ్ ఇవ్వగా తన అఖిల్ ఈ విధంగా కౌగిలించుకోడని మోనాల్ చెబుతుంది.దీంతో అఖిల్ తనకు కొంచెం టైం కావాలంటూ అక్కడినుంచి వెళ్లిపోతాడు.బిగ్ బాస్ నిన్నటి నామినేషన్ ప్రక్రియలో ఒక కంటెస్టెంట్ ఇద్దరి తలలపై గుడ్లు పగలగొట్టాలని చెప్పారు.దీంతో మోనాల్ తనకు గుడ్డు కొట్టించుకోవడం ఇష్టం లేదని బిగ్ బాస్ కు చెప్పగా బిగ్ బాస్ మోనాల్ ను నామినేట్ చేసేవాళ్ల తలపై గుడ్డు పగలగొట్టాలని చెప్పారు.

Telugu Akhil, Ariyana, Biggboss, Bigg Boss, Eggs, Monal Gajjar, Sohel-Movie

హౌస్ లో మొదట అరియానా హారిక, సోహైల్ తలలపై గుడ్లు పగలగొట్టి ఇద్దరినీ నామినేట్ చేసింది.తనను నామినేట్ చేయడంతో సోహైల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. మార్నింగ్ పనిష్మెంట్ ఇచ్చి అది చేయలేదంటూ గలీజ్ రీజన్ చెప్పి తనను నామినేట్ చేయడం సరికాదని సోహైల్ అన్నారు.అరియానా పుడింగిలా ఫీల్ కావడంతో పాటు యాటిట్యూడ్ చూపిస్తోందని చెప్పారు.

అవినాష్ అభిజిత్, హారికలను నామినేట్ చేశాడు.
సొహైల్ మోనాల్ ను, అభిజిత్ ను నామినేట్ చేసి అఖిల్ కు, తనకు మధ్య గొడవలు రావడానికి మోనాల్ కారణమని చెప్పాడు.

అభిజిత్ అవినాష్ ను నామినేట్ చేయడంతో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది.బిగ్ బాస్ ప్రోమోలో అఖిల్ మోనాల్ ను నామినేట్ చేసినట్లు చూపించగా అఖిల్ నామినేషన్ కు ఏ కారణం చెబుతాడో చూడాలి.

ఈ వారం బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియకే రెండు రోజులు కేటాయించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube