ఆ కంటెస్టెంట్ కోడలైతే బాగుంటుందంటున్న అభిజిత్ తల్లి!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఒకవైపు విమర్శలు మూటగట్టుకుంటున్నా షో నిర్వాహకులు ప్రోమోల ద్వారా, టాస్కుల ద్వారా షోపై ఆసక్తి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

వీక్ డేస్ ఎపిసోడ్లు అంతగా అలరించకపోయినా వీకెండ్ ఎపిసోడ్లలో నాగార్జున కంటెస్టెంట్ల లోపాలను ఎత్తిచూపుతూ షోకు మంచి టీఆర్పీ రేటింగులు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు.

ఈ సీజన్ లో బిగ్ బాస్ షోలో లవ్ ట్రాకులు కొందరు కంటెస్టెంట్లను వార్తల్లో నిలిపాయి.బిగ్ బాస్ షోలో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న అభిజిత్ మొదట్లో మోనాల్ తో లవ్ ట్రాక్ నడపగా ఆ తరువాత హారికతో సన్నిహితంగా మెలుగుతున్నారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పాటు పలు సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్ ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ప్రతిసారి లవ్ ట్రాకుల వల్లే సేఫ్ అవుతున్నారని నెటిజన్లు భావిస్తున్నారు.బిగ్ బాస్ లో అభిజిత్ లవ్ ట్రాకుల గురించి అభిజిత్ తల్లి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అభిజిత్ జంతుప్రేమికుడని.జంతువులకు హాని జరిగితే అస్సలు తట్టుకోలేడని అభిజిత్ తల్లి అన్నారు.

Advertisement

బిగ్ బాస్ షోకు వెళ్లకముందు చాలా సందర్భాల్లో అభిజిత్ ను ఎవరినైనా లవ్ చేశావా.? అని చాలాసార్లు అడిగామని అయితే ఎవరినీ లవ్ చేయలేదని చెప్పాడన్నారు.బిగ్ బాస్ షోలో అభిజిత్ కు హారిక జోడీగా బాగుంటుందని ఆమె అన్నారు.

అభిజిత్ హారిక ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని.వారిద్దరి మధ్య స్నేహంతో పాటు మంచి అవగాహన ఉందని తెలిపారు.

అభిజిత్ తల్లి హారిక కోడలిగా కావాలంటూ తన మనస్సులోని ఇష్టాన్ని బయటపెట్టేసింది.మరి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అభిజిత్ హారికతో ప్రేమ గురించి ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు