బిగ్ బాస్ పై రగిలిపోతున్న అభిజిత్ ఫ్యాన్స్.. కారణమిదే..?  

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో నేటితో 12 వారాలు పూర్తి చేసుకోనుంది.డిసెంబర్ నెల 20వ తేదీన గ్రాండ్ ఫినాలే జరగనుంది.

TeluguStop.com - Bigg Boss Contestant Abhijeet Fans Fire On Bigg Boss

బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరు కాగా ఈ సీజన్ కు కూడా ఒక స్టార్ హీరో గెస్ట్ గా రానున్నారు.గ్రాండ్ ఫినాలేకు మూడు వారాలు ఉన్నా ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

కొందరు సెలబ్రిటీలు అభిజిత్ ను గెలిపించాలంటూ సోషల్, వెబ్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

TeluguStop.com - బిగ్ బాస్ పై రగిలిపోతున్న అభిజిత్ ఫ్యాన్స్.. కారణమిదే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ కూడా ఇన్నిరోజులు అభిజిత్ విషయంలో సానుకూలంగా ఉన్నారని కామెంట్లు వినిపించాయి.

కానీ నిన్న రాత్రి బిగ్ బాస్ జలజ దెయ్యం లగ్జరీ బడ్జెట్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ ప్రదర్శన ఆశాజనకంగా లేదని.అభిజిత్ వరస్ట్ పెర్ఫామర్ అని బిగ్ బాస్ చెప్పారు.

టాస్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బిగ్ బాస్ సూచనలు చేశారు.అయితే అభిజిత్ ను వరస్ట్ పెర్ఫామర్ గా ప్రకటించడంపై అభిజిత్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.

అభిజిత్ ఫ్యాన్స్ బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు సరిగ్గా లేవని.పిచ్చిపిచ్చి టాస్క్ లు ఇస్తే ఎవరూ ఏం చేయలేరని అభిప్రాయపడుతున్నారు.ఇచ్చినవే పిచి టాస్క్ లు అయినప్పుడు ఆ టాస్క్ లకు వరస్ట్ పెర్ఫామర్ గా అభిజిత్ ను ప్రకటించడం సరికాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.అభిజిత్ ఫ్యాన్స్ ఈ విషయంలో బిగ్ బాస్ నే తప్పుబడుతూ బిగ్ బాస్ ను ట్రోల్ ను చేస్తున్నారు.

సోషల్ మీడియాలో అభిజిత్ పేరుతో ఆర్మీలు ఉన్నాయి.అయితే కొందరు ఈ ఆర్మీలను పెయిడ్ ఆర్మీలని చెబుతుంటే మరి కొందరు మాత్రం అభిజిత్ వ్యక్తిత్వం మంచిదని అందుకే సపోర్ట్ చేస్తున్నామని చెబుతున్నారు.

నాగబాబు, అక్కినేని అమల లాంటి సెలబ్రిటీలు సైతం అభిజిత్ కు సపోర్ట్ చేయడం గమనార్హం.

#Abhijit Fans #Bigg Boss 4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు