బిగ్ బాస్ బిందుమాధవి.. ఆ హీరో ని పెళ్లి చేసుకోబోతుందట?

గత కొంత కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అందమైన హీరోయిన్ లు ఎంతోమంది పెరిగిపోయారు.ఇక అవసరానికంటే మితిమీరిన అందాల ఆరబోత చేస్తూ అందరి మతి పోగొడుతున్నారు.

 Bigg Boss Bindu Madhavi Love Life ,bigg Boss ,  Bindu Madhavi,  Love , Biggboss-TeluguStop.com

ఇక సినిమాల్లో అతిలోకసుందరి గా కనిపిస్తున్నారు.ఇక ఇంత ఉన్న ఒక్కటి మాత్రం తక్కువైంది.

అదే తెలుగు అందాలు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు తప్ప మన తెలుగు హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించడం లేదు .ఇక ఇలాంటి టైంలోనే ఈషా రెబ్బా బిందుమాధవి, అంజలి, అనన్య నాగల్ల లాంటి హీరోయిన్లు క్లిక్ అయ్యారు.కానీ ఎందుకో తెలుగు హీరోయిన్ లకు మాత్రం అవకాశాలు రావడం లేదు.

ఈ క్రమంలోనే ఇక బిందుమాధవి గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చిన్న చితక అవకాశాలతోనే సరిపెట్టుకుంది.స్టార్ హీరోల సరసన మాత్రం అవకాశాలు రాలేదు.

కోలీవుడ్లో మాత్రం బాగా పాపులారిటీ సంపాదించింది.తెలుగులో అవకాయ బిర్యానీ సినిమాతో మంచి గుర్తింపు వచ్చినా అవకాశలు కూడా రాలేదు.

కోలీవుడ్లో మాత్రం మంచి గుర్తింపు వచ్చిన పాత్రలో నటించింది.ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని మళ్ళీ ఇన్నాళ్ళకు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆటతీరుతో అందరినీ మెప్పించి సూపర్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటుంది.కాగా ప్రస్తుతం బిందు మాధవి లవ్ ఎఫైర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.

Telugu Ananya Nagalla, Anjali, Bigg Boss, Biggboss, Bindu Madhavi, Harish Kalyan

తమిళ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ తో ప్రస్తుతం బిందుమాధవి ప్రేమలో ఉందట.ఇద్దరు గత కొంత కాలం నుంచి డీప్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.ఇక ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ ఓటిటి హౌస్ లో ఉన్న బిందుమాధవినీ కళ్యాణ్ సపోర్ట్ ట్విట్ కూడా పెట్టడంతో ఇక ఈ అనుమానాలకు మరింత బలం వచ్చినట్టు అయిపోయింది.ఎన్నో రోజుల నుంచి కోలీవుడ్ మీడియా వీరి రిలేషన్ షిప్ గురించి వార్తలు రాస్తోంది.

ఇప్పుడు కళ్యాణ్ ట్విట్ తో తెలుగు మీడియాలో కూడా రూమర్లు మొదలయ్యాయి.బిగ్బాస్ సీజన్ వన్ లో బిందుమాధవి పాల్గొంటే ఇక అదే సీజన్ లో కళ్యాణ్ కూడా పాల్గొన్నాడు.

ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube