అలాంటి ఫోటోలు షేర్ చేసిందంటూ బిగ్ బాస్ బ్యూటీ ని ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు...

తెలుగులో ప్రముఖ దర్శకుడు “శ్రీకాంత్ అడ్డాల” దర్శకత్వం వహించిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి నటిగా పరిచయం అయిన యంగ్ బ్యూటి “తేజస్వి మదివాడ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు మొదటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించినప్పటికీ క్రమక్రమంగా తన నటనా ప్రతిభను నిరూపించుకుని హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది.

 Bigg Boss Beauty Tejaswi Madivada Trolled For Passport Size Photo, Bigg Boss, Te-TeluguStop.com

కానీ దురదృష్టవశాత్తు ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.దీంతో అడపాదడపా చిత్రాలలో హీరోయిన్ గా మరియు రెండో హీరోయిన్ గా నటిస్తూనే మరో పక్క పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది.

అయితే సోషల్ మీడియా మాధ్యమాలలో సినీ సెలబ్రిటీల కు సంబంధించిన ఎలాంటి విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే తాజాగా నటి తేజస్వి మదివాడ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలు మరియు ఆ ఫోటోలు పెట్టిన క్యాప్షన్ వల్ల సోషల్ మీడియా మాధ్యమాలలో కొందరు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే ఇంతకీ ఆ ఫోటోలని ఒకసారి పరిశీలించినట్లయితే తేజస్వి మదివాడ చీర దుస్తులను ధరించి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఆ ఫోటో కి ఏకంగా మై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అంటూ క్యాప్షన్ పెట్టింది.దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోపై స్పందిస్తూ పాస్ పోర్ట్ సైజు ఫోటోకి ఇలా బోల్డ్ గా ఫోజులు ఇస్తారా…? అంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతేకాకుండా ఈ ఫోటోని షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపుగా లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.

Telugu Bigg Boss, Biggboss, Passportsize, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తేజస్వి మదివాడ తెలుగులో కమిట్మెంట్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు.దీనికితోడు కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రస్తుతం ప్రజలు సినిమా థియేటర్లకు వచ్చే సూచనలు లేకపోవడంతో తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల అప్డేట్ ఇస్తామని చిత్ర యూనిట్ సభ్యులు గతంలో తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube