బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే..?  

bigg boss beauty punarnavi bhupalam engagement pics goes viral Big Boos 3, Rahul, punarnavi bhupalam, Instagram, Web Series, Engagement Ring, Uyyala Jampala - Telugu Big Boos 3, Engagement Ring, Instagram, Punarnavi Bhupalam, Rahul, Uyyala Jampala, Web Series

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్, నటి పునర్నవి భూపాలం పెళ్లి ఫిక్స్ అయిందా.? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించి పునర్నవి భూపాలం తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.ఆ సినిమా తరువాత పునర్నవి మరికొన్ని సినిమాల్లో నటించినా పునర్నవికి పెద్దగా గుర్తింపు రాలేదు.

TeluguStop.com - Bigg Boss Beauty Punarnavi Bhupalam Engagement Pics Goes Viral

అయితే బిగ్ బాస్ షోలో రాహుల్ తో లవ్ ట్రాక్ తో పునర్నవి పాపులర్ అయింది.

పునర్నవి బిగ్ బాస్ షోలో టాస్కులు బాగా ఆడకపోయినా ప్రేక్షకుల్లో తెచ్చుకున్న ఫాలోయింగ్ వల్ల చాలాసార్లు సేవ్ అయింది.

TeluguStop.com - బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ షో పూర్తైన తరువాత రాహుల్ తో కలిసి పునర్నవి ఇంటర్వ్యూలు ఇచ్చింది. రాహుల్, పునర్నవి అభిమానులు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న పునర్నవి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఎంగేజ్ మెంట్ రింగ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది.

తనకు పెళ్లి ఫిక్స్ అయిందని బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి చెప్పకనే చెప్పేసింది.

పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో పునర్నవికి చాలాకాలం నుంచి పరిచయం ఉందని తెలుస్తోంది.మంచి హోదాలో ఉన్న వ్యక్తినే పునర్నవి పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.అయితే వరుడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఎంగేజ్ మెంట్ రింగ్ ను చూపిస్తూ “మొత్తానికి జరిగిపోయింది” అనే క్యాప్షన్ తో పునర్నవి ఫోటోను షేర్ చేశారు.

అయితే మరి కొందరు మాత్రం వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పునర్నవి ఫోటోను షేర్ చేసిందని.ఎంగేజ్ మెంట్ రింగ్ ద్వారా వెబ్ సిరీస్ పై అంచనాలు పెంచాలని పునర్నవి భావిస్తోందని చెబుతున్నారు.

పునర్నవి బ్లాక్ హార్ట్ ఎమోజీని పోస్ట్ లో పెట్టడం వల్ల ఈ అనుమానాలు కలుగుతున్నాయి.అయితే పునర్నవి అధికారికంగా ప్రకటిస్తే మాత్రమే ఆమె ఎంగేజ్ మెంట్ గురించి స్పష్టత వస్తుంది.

View this post on Instagram

Finally! It's happening 🥰❤️

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

#Engagement Ring #Web Series #Uyyala Jampala #Rahul #Big Boos 3

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Beauty Punarnavi Bhupalam Engagement Pics Goes Viral Related Telugu News,Photos/Pics,Images..