బిగ్ బాస్ బ్యూటీకి కరోనా పాజిటివ్..?

గత ఏడాది ప్రపంచమంతటా విజృంభించిన కరోనా ఇప్పటికీ తగ్గుముఖం పడుతుందని అనుకోగా.ఇటీవలే మళ్లీ మరింత వేగంగా దూసుకొస్తోంది కరోనా వైరస్.

 Bigg Boss Beauty Nikki Tamboli Tests Corona Positive ,  Nikki Tamboli ,corona Po-TeluguStop.com

ఈ ఏడాది వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాగా.కొన్ని చోట్ల మాత్రమే వ్యాక్సిన్ టీకాలను అందించారు.

ప్రస్తుతం కరోనా వైరస్ విపరీతమైన లక్షణాలతో వ్యాపిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పటికే పలు చోట్ల సోకగా తాజాగా బిగ్ బాస్ బ్యూటీ కి కరోనా పాజిటివ్ తేలింది.

ఇంతకీ ఆమె ఎవరంటే.

హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొన్న కంటెస్టెంట్ లలో ఒకరు నిక్కీ తంబోలి.

ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఫైనలిస్ట్ గా నిలిచి మంచి గుర్తింపు అందుకుంది.ఇక ఈమెకు తాజాగా కరోనా సోకడంతో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది.

ఆమెకు శుక్రవారం రోజు ఉదయమే కోవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చిందని తెలిపింది దీంతో ఆమె స్వయంగా క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకుందట.

ఇక ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో ఇంటి నుంచే డాక్టర్లతో సలహాలు తీసుకొని మెడిసిన్స్ వాడుతుందట‌.అంతేకాకుండా గత కొద్ది రోజుల నుండి తనతో సన్నిహితంగా ఉన్న వారందరినీ కోవిడ్ పరీక్షలు చేయించుకోమని కోరింది.ఇక మీ ప్రేమ, సహకారాలతో ఎప్పటికి రుణపడి ఉంటాను అంటూ అభిమానులతో పంచుకుంది.

దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ, మాస్కులు ధరించండంటూ, ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకోండంటూ, దూరాన్ని పాటించాలంటూ లవ్ అండ్ లైట్ అని పంచుకుంది.ఇక ఈమె వైరస్ పాజిటివ్ కు ముందు కొన్ని మ్యూజిక్ వీడియోస్ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో ఇలా జరుగగా.

ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube