యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ?

బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసిన దేత్తడి హారికకు ఎంతో క్రేజ్ పెరిగిపోయింది.హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమెకు పెద్దగా ఆఫర్లు లేకపోయినా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.

 Bigg Boss Beauty Dethadi Harika Neeli Nelli Folk Song Video Released Dethadi Har-TeluguStop.com

హౌస్ లోకి వెళ్లకముందు యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఎంతోమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న హారిక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ లో వీడియోలను చేస్తోంది.తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హారికను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఆ శాఖ మంత్రికి తెలియకుండా పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ శ్రీనివాస్ గుప్తా ఆమెను నియమించడంపై పర్యాటక శాఖ మంత్రి ఎంతో సీరియస్ అయ్యారు.పలు వివాదాల అనంతరం హారిక స్వయంగా ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలియజేసింది.

Telugu @harika_alekhya, Bigg Boss, Dethadi Harika, Raghu Master-Movie

బిగ్ బాస్ ద్వారా తనకు వచ్చిన క్రేజ్ ను కంటిన్యూ చేయడం కోసం హారిక వివిధ ప్రయత్నాలను చేస్తుంది.ఇందులో భాగంగానే ఒక ఫోక్ సాంగ్ కు డాన్స్ వేస్తూ ఆ పాటకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.దీంతో ఈ ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతుంది.ఎంతో అద్భుతంగా చేసిన ఈ పాట ప్రస్తుతం ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

నీలి నీలి కళ్ళ వాడే అనే పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా మాస్ స్టెప్పులతో హారిక మరింత రెచ్చిపోయింది.ఈ విధంగా మాస్ స్టెప్పులతో హారిక చేసిన డాన్స్ ఎంతగానో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఎంతో అద్భుతంగా డాన్స్ చేసిన ఈ పాటకు సంబంధించిన వీడియో ఆదివారం యూట్యూబ్లో విడుదల కావడంతో ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ పాట దూసుకుపోతుందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube