బిగ్ బాస్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. యంగ్ హీరోతో..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో పాల్గొని టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింఫును సంపాదించుకున్నారు అరియానా గ్లోరీ.బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ ఇప్పటికే వరుస అవకాశాలతో బిజీ అవుతుండగా అరియానాకు కూడా ఆఫర్లు వస్తున్నాయి.

 Bigg Boss Beauty Ariyana Glory Got Chance In Raj Tarun Movie,ariyana Glory, Raj-TeluguStop.com

ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అరియానాకు బిగ్ బాస్ షోలో టాస్కులు అద్భుతంగా చేస్తుందని పేరు వచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందు పెద్దగా క్రేజ్ లేకపోయినా బిగ్ బాస్ షో ద్వారా అరియానా గుర్తింపును సంపాదించుకున్నారు.

అయితే తాజాగా అరియానా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రాజ్ తరుణ్ తో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేసింది.బిగ్ బాస్ షో తరువాత తన లైఫ్ లో ఇది ఒక మంచి రోజని.

రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్.అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గవిరెడ్డి గారికి థ్యాంక్స్ అని అరియానా పేర్కొన్నారు.

రాజ్ తరుణ్ సినిమాలో అరియానా నటిస్తున్నట్టు కన్ఫామ్ కాగా అరియానా హీరోయిన్ గా నటిస్తున్నారో లేక మరో పాత్రలో నటిస్తున్నారో తెలియాల్సి ఉంది.గత సీజన్లు కంటెస్టెంట్లకు పెద్దగా కలిసిరాకాపోయినా బిగ్ బాస్ సీజన్ 4 మాత్రం కంటెస్టెంట్లకు ప్లస్ అయిందనే చెప్పాలి.అన్నపూర్ణ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం.మరోవైపు ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

కుమారి 21ఎఫ్ సినిమా తరువాత ఆ స్థాయి సక్సెస్ కోసం రాజ్ తరుణ్ ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.

నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా రాజ్ తరుణ్ కు వరుస ఆఫర్లు వస్తూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube