శృతి మించిన అరియానా అవినాష్ రొమాన్స్.. తిట్టిపోస్టున్న నెటిజన్లు..?

ఈ మధ్య కాలంలో ఈ ఛానెల్ ఆ ఛానెల్ అనే తేడాల్లేకుండా ఆన్ని ఛానెళ్లు పండుగల సమయంలో ఈవెంట్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.మంచి టీఆర్పీ రేటింగ్ లు వస్తుండటంతో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ అన్నీ ఈవెంట్ల బాట పడుతున్నాయి.

 Bigg Boss Ariyana And Avinash Rain Song Romance In Star Maa Event-TeluguStop.com

అయితే ఈ ఈవెంట్ల పేరిట ఛానెళ్లు చేస్తున్న ప్రయోగాలపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఉగాది పండుగ సందర్భంగా స్టార్ మా ఛానెల్ లో మా ఉగాది వేడుక పేరుతో ఒక ఈవెంట్ ప్రసారమైంది.

 Bigg Boss Ariyana And Avinash Rain Song Romance In Star Maa Event-శృతి మించిన అరియానా అవినాష్ రొమాన్స్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఈవెంట్ లో అవినాష్ అరియానా జంటగా ఒక పాటకు డ్యాన్స్ వేశారు.బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ఈ జోడీ డ్యాన్స్ వేయడంలో ఆశ్చర్యం లేకపోయినా శృతి మించిన రొమాన్స్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

పండుగ సమయంలో పిల్లలతో కలిసి చూసే షోలో హద్దు మీరి అరియానా, అవినాష్ ప్రవర్తించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వాన పాటకు స్టెప్పులు వేసిన ఈ జంటకు నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.

బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ అరియానా మంచి ఫ్రెండ్స్ గా గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే బిగ్ బాస్ హౌస్ కంటే హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాతే ఈ జోడీకి మంచి గుర్తింపు వచ్చింది.

కామెడీ స్టార్స్ కామెడీ షోలో అవినాష్ అరియానా కలిసి చేసిన స్కిట్లు సక్సెస్ అయ్యాయి.అలా ఈ జోడీకి మంచి పేరు వచ్చింది.

అయితే తాజాగా ఈవెంట్ లో శృతి మించిన రొమాన్స్ తో అవినాష్, అరియానా వచ్చిన మంచి పేరును పోగొట్టుకున్నారు.నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్న కామెంట్లకు ఈ జోడీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

#Star Maa Event #Ariyana Avinash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు