అఖిల్ కు షాకింగ్ గిఫ్ట్.. ఇన్నేళ్లలో ఎప్పుడు రాలేదంటూ?

బుల్లితెరపైప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మంది సెలబ్రిటీల జీవితాలను మార్చేస్తుందని చెప్పవచ్చు.బిగ్ బాస్ తర్వాత వారి జీవితం బిగ్ బాస్ కి ముందు తరువాత అన్నట్టుగా మారిపోతుంది.

 Bigg Boss Akhil Sarthak Gifted By A Old Lady-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎంతో మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొని ప్రస్తుతం కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ విధంగా తెలుగు బిగ్ బాస్ రియాలిటీ సీజన్ ఫోర్ లోకి ఎంటరైన కంటెస్టెంట్ లో అఖిల్ ఒకరిని చెప్పవచ్చు.

అఖిల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

 Bigg Boss Akhil Sarthak Gifted By A Old Lady-అఖిల్ కు షాకింగ్ గిఫ్ట్.. ఇన్నేళ్లలో ఎప్పుడు రాలేదంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనాల్ ప్రేమ వ్యవహారం ఇతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది.

ఈ క్రమంలోనే అఖిల్ బిగ్ బాస్ విన్నర్ గా గెలుస్తారని చాలా మంది భావించినప్పటికీ అతను రన్నర్ గా మాత్రమే మిగిలిపోయారు.బిగ్ బాస్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అఖిల్ హౌస్ నుంచి బయటకు రాగానే అతడు ఆశించిన మేర అవకాశాలు మాత్రం రాలేదు.

ఈ క్రమంలోనే మోనాల్ తో కలిసి “తెలుగు అబ్బాయి గుజరాతి అమ్మాయి” అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అఖిల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన అఖిల్ ఏ మాత్రం డబ్బును సంపాదించేలేదని తెలుసుకున్న ఒక ఆవిడ అఖిల్ కు లక్ష రూపాయలు గిఫ్ట్ ఇచ్చినట్టు తెలిపారు.అయితే ఆమె ఇచ్చిన కానుకను మొదట్లో తిరస్కరించిన అఖిల్ ఆ తర్వాత తన చెప్పిన మాటలు, ఆమె చూపించిన ప్రేమకు తన గిఫ్ట్ ను తీసుకోకతప్పలేదు.

ఈ క్రమంలోనే అఖిల్ మాట్లాడుతూ.నా పట్ల అపారమైన ప్రేమను, ఆశీర్వాదాన్ని చూపిస్తున్న ఆ భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ.లక్ష రూపాయలు ఇచ్చిన లక్ష్మి ఝాన్సీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా నటి శారద ఫోన్ చేసిమాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందని ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది అంటూ అఖిల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

#Lakshmi Jhansi #Lady #Actress Sarada #Bogg Boss #Rupees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు