మోనాల్ తో అందుకే నటించట్లేదు.. క్లారిటీ ఇచ్చిన అఖిల్..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో తెలుగులో ప్రతి సీజన్ లో ఒక జోడీ లవ్ ట్రాక్ ద్వారా వార్తల్లో నిలుస్తోంది.బిగ్ బాస్ షో సీజన్ 4 ద్వారా మోనాల్ గజ్జర్ అఖిల్ సార్థక్ జోడీ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Bigg Boss Akhil Sarthak Clarity About Movie With Monal Gajjar-TeluguStop.com

మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్ లో 14 వారాలు ఉండగా అఖిల్ సార్థక్ బిగ్ బాస్ షోకు రన్నర్ గానిలిచారు.బయటకు వచ్చిన తరువాత మోనాల్, అఖిల్ సార్థక్ వేర్వేరుగా ఆఫర్లతో బిజీ అవుతుండగా ఒక వెబ్ సిరీస్ లో మాత్రం కలిసి నటిస్తున్నారు.

కెరీర్ తొలినాళ్లలో కొన్ని సీరియళ్లలో నటించిన అఖిల్ సార్థక్ ఫస్ట్ టైం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా ఒక కొత్త హీరోయిన్ నటిస్తున్నారు.

 Bigg Boss Akhil Sarthak Clarity About Movie With Monal Gajjar-మోనాల్ తో అందుకే నటించట్లేదు.. క్లారిటీ ఇచ్చిన అఖిల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అఖిల్ కు జోడీగా కొత్త హీరోయిన్ ను తీసుకోవడంతో కొంతమంది నెటిజన్లు, మోనాల్ ఫ్యాన్స్ కొత్త హీరోయిన్ కు బదులుగా మోనాల్ గజ్జర్ ను తీసుకోవచ్చు కదా.? అని అఖిల్ సార్థక్ కు సూచిస్తున్నారు.ఆ ప్రశ్నకు అఖిల్ బదులిస్తూ డైరెక్టర్ కొత్త హీరోయిన్ ను ఎంపిక చేశారని అందుకే మోనాల్ తో ఈ సినిమాలో నటించలేదని అన్నారు.

Telugu Akhil And Monal Movie, Akhil Sarthak, Bigg Boss Season 4 Runner, Bigg Boss Show, First Time Movie, Movie With Monal Gajjar, New Heroine-Movie

మోనాల్ తెలుగమ్మాయి కూడా కాదని మోనాల్ తో తాను వేరే సినిమాలలో నటిస్తానని అఖిల్ చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక 27 కథలు విన్నానని 27వ కథ ఫస్ట్ టైం మూవీ అని అఖిల్ చెప్పుకొచ్చారు.ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.2012 సంవత్సరం కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నానని అఖిల్ తెలిపారు.

కెరీర్ తొలినాళ్లలో సీరియళ్లు, యాడ్స్ లో నటించానని ఆ తరువాత బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నానని అఖిల్ అన్నారు.

ఫ్యాన్స్ వల్లే ఈ స్థాయికి రావడం సాధ్యమైందని అఖిల్ పేర్కొన్నారు.

#MovieWith #BiggBoss #Bigg Boss Show #AkhilAnd #New Heroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు