ఎలాంటి అమ్మాయి ఇష్ట‌మో చెప్పిన అభిజిత్‌.. గాల్లో తేలిపోయిన‌ అరియానా?  

abhijith says what kind of girl he like! abhijith, ariyana glory, bigg boss 4, bigg boss telugu, latest news, night out party, lady contestants - Telugu Abhijith, Ariyana Glory, Bigg Boss 4, Bigg Boss Telugu, Lady Contestants, Latest News

నాగార్జున హోస్ట్‌గా ఇటీవ‌ల ప్రారంభం అయిన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4‌.న‌ల‌బై రోజులు పూర్తి చేసుకుంది.

TeluguStop.com - Bigg Boss Abhijeet Ideal Type Of Girl Friend

రోజుకో మ‌లుపు తిరుగుతూ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న బిగ్ బాస్ హౌస్‌లో.కొత్త కొత్త టాస్కులు, ల‌వ్ ట్రాకులు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇక నిన్న‌టి ఎపిసోడ్ మొత్తం ఎంతో స‌ర‌దాగా సాగిపోయింది.ఇంటి స‌భ్యులంద‌రికీ నిన్న బిగ్ బాస్ `రేసర్ ఆఫ్‌ ద హౌజ్`‌ అనే టాస్క్ ఇవ్వ‌గా.

TeluguStop.com - ఎలాంటి అమ్మాయి ఇష్ట‌మో చెప్పిన అభిజిత్‌.. గాల్లో తేలిపోయిన‌ అరియానా-General-Telugu-Telugu Tollywood Photo Image

మెహ‌బూబ్ విజయం సాధించాడు.
అనంత‌రం హౌజ్‌లోని అమ్మాయిలకు నైట్‌ ఔట్ పార్టీ చేసుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ క‌ల్పించారు.

దీంతో పొట్టి పొట్టి బ‌ట్ట‌ల‌తో అందంగా ముస్తాబైన‌ అమ్మాయిలు నైట్‌ ఔట్ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేశారు.మ‌రోవైపు అబ్బాయిల‌తో ఓ ఆట ఆడుకుందామ‌ని ప్లాన్ చేసిన అమ్మాయిలు.

వాళ్ల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టారు.ఈ క్ర‌మంలోనే మొద‌ట‌ అభిజిత్‌ను తమ రూమ్‌లోకి పిల్చుకుని పొగిడించుకున్నారు.
ఎలాగో పులిహోర క‌ల‌ప‌డంలో పీహెచ్‌డీ చేసిన అభిజిత్‌.త‌న‌దైన శైలిలో పొగుడుతూ అమ్మాయిల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు.ఆ త‌ర్వాత నీవు ఎలాంటి అమ్మాయిని ఇష్ట‌ప‌డ‌తావు అని అభిజిత్‌ను ప్ర‌శ్నించారు అమ్మాయిలు.దీనికి స‌మాధానంగా అభిజిత్ మాట్లాడుతూ.

లెవ‌ల్ హెడెడ్‌గా, నిజాయితీగా ఉండాలి, కరెక్ట్ నిర్ణ‌యాలు తీసుకోగల‌గాలి.ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పుకొచ్చాడు.
అనంత‌రం ఇక్క‌డున్న వాళ్ల‌లో ఎవ‌రితో డేట్‌కు వెళ్తావని అడ‌గ్గా.అభిజిత్ అరియానా పేరు చెప్పాడు.దీంతో అరియానా ఫుల్ ఎగ్జైట్ అయ్యి.గాల్లో తేలిపోయింది.

ఇక ఆ త‌ర్వాత అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్, సోహైల్‌, అఖిల్‌ల‌ను టీజింగ్ చేసి.ఓ ఆట ఆడుకున్నారు.

మొత్తానికి అమ్మాయిలు, అబ్బాయిలు అర్థ‌రాత్రి వ‌ర‌కు డ్యాన్సులు, పాట‌లు పాడుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు.

#Bigg Boss 4 #Ariyana Glory #Abhijith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Bigg Boss Abhijeet Ideal Type Of Girl Friend Related Telugu News,Photos/Pics,Images..

GENERAL-TELUGU