బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీకి కరెంట్ షాక్.. తృటిలో తప్పిన పెనుప్రమాదం?

ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో ముగిసిన విషయం తెలిసిందే.ఈ సారీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ గా సన్నీ గెలిచాడు.

 Bigg Boss 5 Telugu Winner Vj Sunny Got Current Shock Press Meet, Vj Sunny, Bigg-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో ఆటలతో, పాటలతో, డాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు.ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సన్నీ బిజీబిజీగా గడిపేస్తున్నారు.

మరొకవైపు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు.ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో సన్నీకి ఒక అనుకోని సంఘటన ఎదురయ్యింది.

ఆ ప్రెస్ మీట్ లో సన్నీ చేతికి కరెంట్ షాక్ కొట్టింది.పూర్తి వివరాల్లోకి వెళితే.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో పలు మీడియా చానల్స్ తో పాటు యూట్యూబ్ చానల్స్ కూడా పాల్గొన్నాయి.ఈ క్రమంలోనే మీడియా, యూట్యూబ్ చానల్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు ఈ క్రమంలోనే మొబైల్ లోనే ఒక క్లిప్పింగ్ ని సన్నీకి చూపిస్తుండగా అకస్మాత్తుగా చిన్నపాటి కరెంట్ షాక్ తగిలింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఇక బిగ్ బాస్ టైటిల్లో గెలిచిన తర్వాత సన్నీ తాను పడ్డ కష్టాలు గురించి, తాను జీవితంలో ఎదుర్కొన్న పలు రకాల సమస్యల గురించి తెలిపాడు.అంతే కాకుండా తన తల్లి కళావతి కోరిన మొదటి కోరికను తీర్చేశాను అని చెప్పుకొచ్చాడు.

ఆ కరెంట్ షాక్ వీడియో ని చూసిన సన్నీ అభిమానులు జాగ్రత్త సన్నీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.బిగ్ బాస్ టైటిల్ గెలిచాడన్న ఆనందంలో ప్రస్తుతం పార్టీలు, ఇంటర్వ్యూలు అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube