బిగ్ బాస్ విజేత ఎవరో చెప్పేసిన గూగుల్?

తెలుగులో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ రోజుకో సంచలనం సృష్టిస్తోంది .19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఇద్దరు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 17 మంది సభ్యులున్నారు.బిగ్‌బాస్ ఏ టాస్క్‌ ఇచ్చినా యుద్ధ వాతావరణాన్ని తలపించే రీతిలో అందరూ కూడా తమ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారు.ప్రతీ ఒక్క సభ్యుడూ టైటిల్‌ ఎలాగైనా సాధించి తీరాలనే కసితో ఆడుతున్నారు.

 Bigg Boss 5 Telugu Winner Declared Google Details Inside, Bigg Boss 5 Telugu, Go-TeluguStop.com

ఇదిలా ఉండగా.బిగ్‌బాస్‌ షో మొదలై 3 వారాలైనా కాలేదు.

అప్పుడే నెట్టింట్లో విన్నర్ ఎవరా అన్న వార్తలు తెగ ట్రోల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా మాకు బిగ్‌బాస్ విన్నరో తెలిసిపోయారంటూ నెటిజన్స్ మామూలుగా ట్రోల్ చేయట్లేదు.

ఇక అసలు విషయమేమిటంటే.ఈ సీజన్‌ విజేత ఎవరు అనే ప్రశ్నకు గూగుల్ సమాధామిస్తోంది.గడిచి కొన్ని రోజులే అయినా అప్పుడే బిగ్‌బాస్ విన్నర్‌ను గూగుల్ చూపిస్తుండడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.గూగుల్‌లో బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌ ఎవరని టైప్‌ చేయగా ఒకరి పేరును చూపిస్తోంది.

ఇంతకీ గూగుల్ ప్రకటించిన పేరు ఎవరిదనుకున్నారు ? ఈ మధ్యే షోలో మంచి ఫుటేజీ దక్కించుకుంటూ.హమీదాతో లవ్‌ ట్రాక్‌ నడుపుతూ, కావాల్సినంత స్క్రీన్‌ స్పేస్‌ సంపాదించుకొని, అటు టాస్క్‌ల్లోనూ తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్న శ్రీరామచంద్ర.

అంతేకాకుండా శ్రీరామ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌, నటుడు, ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 5 విజేత కూడా అంటూ అతడి వివరాలను సైతం చూపిస్తోంది గూగుల్.ఇది చూసిన ఆయన అభిమానులు మాత్రం గూగుల్‌ ఈ విషయాన్ని ముందే పసిగట్టేసిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

Telugu Google, Priyanka Singh, Sriram-Movie

ఇక ఇదే గూగుల్‌లో బిగ్‌బాస్‌ 5 తెలుగు టైటిల్‌ విన్నర్‌ ఎవరని టైప్‌ చేయగా ప్రియాంక సింగ్‌ను విజేతగా చూపిస్తోంది.మరి గూగుల్‌ చెప్పినట్లుగా రానున్న రోజుల్లో శ్రీరామ్‌ విన్‌ అవుతారా? లేదా ప్రియాంక సింగ్‌ బిగ్‌బాస్‌ విజేతగా నిలుస్తారా ? అన్నది వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube