EMK : బిగ్‌బాస్5 కి చెత్త రికార్డు తప్పక పోవచ్చు

ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు షో ముగింపు దశకు వచ్చింది.అందుకే మూడు నెలల క్రితం షూట్ చేసిన మహేష్‌ బాబు ఎపిసోడ్‌ ను నేడు టెలికాస్ట్‌ చేయబోతున్నారు.

 Bigg Boss 5 Telugu Vs Mahesh Babu Special Evaru Meelo Kotishwarulu Episode-TeluguStop.com

స్పెషల్‌ గెస్ట్‌ వచ్చిన సమయంలో ప్రతి ఎపిసోడ్ కూడా నిరాశ పర్చింది.ఏమాత్రం సంతృప్తికర రేటింగ్‌ ను ఎన్టీఆర్ షో దక్కించుకోలేదు.

మహేష్‌బాబు ఎపిసోడ్‌ మాత్రం ఖచ్చితంగా రికార్డు బ్రేక్‌ చయబోతున్నట్లుగా అభిమానులు నమ్ముతున్నారు.రికార్డు బ్రేకింగ్ టీఆర్‌పీ రేటింగ్‌ లక్ష్యంగా గత వారం పది రోజులుగా జెమిని టీవీ వారు తెగ ఊదరగొడుతున్నారు.

వీరిద్దరి మద్య సాగిన సంభాషణలు ఏంటీ అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తున్నారు.సాదారణంగా అయితే ఆది వారం ఈ షో ఉండదు.

కాని మహేష్‌ బాబు ప్రత్యేక ఎపిసోడ్‌ మరియు.మహేష్‌ బాబుతో ప్రత్యేక షో కనుక ఆదివారం టెలికాస్ట్‌ చేయబోతున్నారు.

ఆది వారం టెలికాస్ట్ అవ్వబోతున్న ఈ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం ఎపిసోడ్ కు గండంగా మారింది.ఇప్పటికే బిగ్ బాస్ కు ముక్కి మూలిగి నార్మల్ రేటింగ్‌ నమోదు అవుతుంది.

ఈ సమయంలో బిగ్‌ బాస్ కు పోటీ అన్నట్లుగా మహేష్‌ బాబు.ఎన్టీఆర్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయితే ఖచ్చితంగా రేటింగ్ ఏంటీ అనేది.

ఎవరు ఏది చూస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బిగ్ బాస్ వీకెండ్‌ ఎపిసోడ్ ల్లో అత్యల్ప రేటింగ్‌ నేడు నమోదు అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.

Telugu Biggboss, Jr Ntr Emk Show, Mahesh Babu Emk, Mahesh Babu Mek, Trp-Movie

ఇప్పటికే పింకీ ఎలిమినేట్‌ అయ్యిందని తెలిపోయింది.కనుక వచ్చే వారం ఎపిసోడ్స్‌ కోసం వెయిడ్‌ చేయడం తప్ప నాగ్‌ సండే ఎపిసోడ్‌ లో ఏమీ ఉండదు అనేది ప్రేక్షకులకు తెలుసు.అందుకే మహేష్‌బాబు.ఎన్టీఆర్‌ ల ఎవరు మీలో కోటీశ్వరులు మాత్రమే చూస్తారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ రెండు షో ల్లో ప్రేక్షకులు ఏ షో ను ఎక్కువగా ఆధరిస్తారు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube