అలా అత్త అవ్వాల్సినదాన్ని సన్నీకి పిన్నినయ్యాను.. ఉమాదేవి కామెంట్స్ వైరల్!

Bigg Boss 5 Telugu Umadevi Comments Sunny Marriage Her Daughter

కార్తీకదీపం సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఉమాదేవి బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని మరింత పెంచుకున్నారు.బిగ్ బాస్ హౌస్ లో ఆమె తిట్ల దండకం వల్ల కొంతమంది ప్రేక్షకులకు ఉమాదేవి నచ్చలేదు.

 Bigg Boss 5 Telugu Umadevi Comments Sunny Marriage Her Daughter-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లోని ఎక్కువమంది హౌస్ మేట్స్ తో గొడవలు పెట్టుకోవడంతో ఉమాదేవి రెండో వారం బిగ్ బాస్ హౌస్ కు దూరం కావాల్సి వచ్చింది.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉమాదేవి సన్నీని సపోర్ట్ చేస్తూ వచ్చారు.

బిగ్ బాస్ షోకు రాకముందే ఉమాదేవికి సన్నీతో పరిచయం ఉంది.సన్నీని ఇంటి అల్లుడిని చేసుకోవాలని ఉమాదేవి అన్నారు.

 Bigg Boss 5 Telugu Umadevi Comments Sunny Marriage Her Daughter-అలా అత్త అవ్వాల్సినదాన్ని సన్నీకి పిన్నినయ్యాను.. ఉమాదేవి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కొన్ని కారణాల వల్ల ఉమాదేవి తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.కళ్యాణ వైభోగం సీరియల్ మొదలైన సమయంలో సన్నీ హీరో అని చెప్పారని సన్నీ ఎవరని అడగగా వీజే అని పెద్దమ్మాయి చెప్పిందని అప్పటికే సన్నీకి భారీస్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారని ఉమాదేవి చెప్పుకొచ్చారు.

సన్నీ చూడటానికి బాగానే ఉండటంతో మా పెద్దమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని గతంలో తాను అనుకున్నానని అయితే అంతలో మా పెద్దమ్మాయి సన్నీ అన్న అనడంతో ఆరోజు నుంచి నా కూతుళ్లకు సన్నీ అన్నగా ఫిక్స్ అయ్యాడని ఉమాదేవి వెల్లడించారు.సన్నీకి అత్తను అవ్వాల్సిన తాను పిన్నిని అయిపోయానని ఉమాదేవి పేర్కొన్నారు.

సీరియల్ లో పాత్ర ప్రకారం తాను సన్నీకి మేనత్త రోల్ లో నటించానని ఉమాదేవి తెలిపారు.

Telugu Sunny, Umadevi-Movie

సీరియల్ లో సన్నీ తనను అత్త అని పిలుస్తాడని అయితే రియల్ లైఫ్ లో మాత్రం సన్నీని తన కూతుళ్లు అన్న అని పిలుస్తారని ఉమాదేవి చెప్పుకొచ్చారు.నా పెద్ద కూతురు అన్న అని పిలవకపోయి ఉంటే సీన్ మరో విధంగా ఉండేదని ఉమాదేవి పేర్కొన్నారు.

#Sunny #Umadevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube