రెమ్యునరేషన్ దానం చేసిన అర్థపావు భాగ్యం.. మళ్ళీ రీ-ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ?

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న ‘కార్తీక దీపం’ సీరియల్‌లో భాగ్యం పాత్రతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి ఉమాదేవి.తాజాగా ఆమె తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5లో ఎంట్రీ ఇచ్చి, కొద్ది కాలంలోనే షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.

 Bigg Boss 5 Telugu Uma Devi Donates Her Remuneration Cancer Baby-TeluguStop.com

హౌజ్‌లో ఈమె ఉన్నది రెండు వారాలే అయినా ఒక్కొక్కరినీ మూడు చెరువుల నీళ్లు తాగించందనే చెప్పాలి.నామినేషన్స్ ప్రక్రియ వచ్చిందంటే చాలు.

ఆమె మరో రూపాన్ని దాల్చేది.ఎవరైనా తనని ఏదైనా అంటే.

 Bigg Boss 5 Telugu Uma Devi Donates Her Remuneration Cancer Baby-రెమ్యునరేషన్ దానం చేసిన అర్థపావు భాగ్యం.. మళ్ళీ రీ-ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మాటకు మాటకు సమాధానమిస్తూ ప్రేక్షకులందరి చేతా గయ్యాలీ అనే పేరునూ తెచ్చుకున్నారు ఉమాదేవి.బిగ్‌బాస్‌ హౌజ్‌లోని దాదాపు అందరు కంటెస్టంట్లతోనూ ఏదో ఒక విధంగా తగువు పెట్టుకొని, కొన్ని సార్లు బీభత్సం సృష్టించారు.

ఇక బిగ్‌బాస్‌ షో నుంచి ఇటీవలే బయటికొచ్చిన ఉమాదేవీ తదుపరి కార్యచరణ ఏంటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇకపోతే ఆమె తాజాగా ఓ గొప్ప నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.

బిగ్‌బాస్‌ షోకి వెళ్లడం ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌ను ఒక మంచి వినియోగిస్తున్నట్టు సమాచారం.తనకు వచ్చిన పారితోషికంలోని కొంత మొత్తాన్ని బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆదుకునేందుకు అందించారు ఉమాదేవి.

ఇప్పటివరకు వివిధ పేర్లతో సెటైర్ వేసిన నెటిజన్లే.ఈ విషయం తెలిసి ఆమె చేసిన మంచి పనిని, మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఆమె గొంతే కాదు, మనసు కూడా పెద్దదే అంటూ ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.మరికొందరు ఆ చిన్నారికి ప్రాణం పోసిన ఉమాదేవికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నారు.

Telugu Bigg Boss, Karthika Deepam, Remuneration Donates, Umadevi-Movie

ఇకపోతే ఉమాదేవి బిగ్‌బాస్ షో నుంచి వెళ్లిపోయాక పస లేకుండా పోయిందని, అంతా నసే ఉందని బుల్లితెర అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.వీలైనంత త్వరగా ఆమెకు రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

#Donates #Karthika Deepam #Umadevi #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు