టిక్ టాక్ బ్యాన్ కాకముందు ఎంతో మంది సాధారణ ప్రజలు వారిలో ఉన్న నైపుణ్యం ఆధారంగా సెలబ్రిటీలు గా మారిపోయారు.ఇలా టిక్ టాక్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దుర్గారావు ఒకరు.
టిక్ టాక్ ద్వారా డాన్సులు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దుర్గారావు ఆ తర్వాత పలాస చిత్రంలోని ‘నాది నెక్కిలీసు గొలుసు’ అనే పాటకు తన భార్యతో కలిసి చేసినటువంటి డాన్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఈ పాపులారిటీతో ఏకంగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు ఆహ్వానం అందుకుని తన భార్యతో కలిసి బుల్లి తెరపై సందడి చేశారు.
అదేవిధంగా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో కూడా సందడి చేశారు.ఇలా టిక్ టాక్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన దుర్గారావు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారు అంటూ అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.
అయితే ఈ కార్యక్రమంలో దుర్గారావు పాల్గొనలేదని తెలిసినప్పటికీ తాజాగా దుర్గారావు ఓ సందర్భంలో సంధిస్తూ బిగ్ బాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తనకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమని.
అందుకే బిగ్ బాస్ సీజన్ 5 లో మహేష్ బాబు మాదిరిగా అందంగా, అలాంటి కటౌట్ ఉన్న యాంకర్ రవి అంటే తనకు ఇష్టమని ఎప్పుడు రవి ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరిస్తారని అందుకే తన పూర్తి మద్దతు యాంకర్ రవికి ఉంటుందని ఈ సందర్భంగా దుర్గారావు తెలియజేశారు.