మహేష్ బాబు కటౌట్ ఉన్న అతడికే నా ఫుల్ సపోర్ట్.. టిక్ టాక్ దుర్గారావు

టిక్ టాక్ బ్యాన్ కాకముందు ఎంతో మంది సాధారణ ప్రజలు వారిలో ఉన్న నైపుణ్యం ఆధారంగా సెలబ్రిటీలు గా మారిపోయారు.ఇలా టిక్ టాక్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దుర్గారావు ఒకరు.

 Bigg Boss 5 Telugu Tiktok Durga Rao And His Wife Support Anchor Ravi-TeluguStop.com

టిక్ టాక్ ద్వారా డాన్సులు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దుర్గారావు ఆ తర్వాత పలాస చిత్రంలోని  ‘నాది నెక్కిలీసు గొలుసు’ అనే పాటకు తన భార్యతో కలిసి చేసినటువంటి డాన్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఈ పాపులారిటీతో ఏకంగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు ఆహ్వానం అందుకుని తన భార్యతో కలిసి బుల్లి తెరపై సందడి చేశారు.

 Bigg Boss 5 Telugu Tiktok Durga Rao And His Wife Support Anchor Ravi-మహేష్ బాబు కటౌట్ ఉన్న అతడికే నా ఫుల్ సపోర్ట్.. టిక్ టాక్ దుర్గారావు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదేవిధంగా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో కూడా సందడి చేశారు.ఇలా టిక్ టాక్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన దుర్గారావు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారు అంటూ అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

అయితే ఈ కార్యక్రమంలో దుర్గారావు పాల్గొనలేదని తెలిసినప్పటికీ తాజాగా దుర్గారావు ఓ సందర్భంలో సంధిస్తూ బిగ్ బాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తనకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమని.

అందుకే బిగ్ బాస్ సీజన్ 5 లో మహేష్ బాబు మాదిరిగా అందంగా, అలాంటి కటౌట్ ఉన్న యాంకర్ రవి అంటే తనకు ఇష్టమని ఎప్పుడు రవి ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరిస్తారని అందుకే తన పూర్తి మద్దతు యాంకర్ రవికి ఉంటుందని ఈ సందర్భంగా దుర్గారావు తెలియజేశారు.

#Anchor Ravi #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు