మానస్ బ్యాడ్ లక్.. టికెట్ టు ఫినాలే గెలిచిన శ్రీరామచంద్ర!

Bigg Boss 5 Telugu Ticket To Finale Winner Sreerama Chandra Will Be The First Finalist

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ లు జరుగుతున్నాయి.బిగ్ బాస్ ఆట క్లైమాక్స్ కి చేరుకుంటుండడంతో హౌస్ మేట్స్ కి భయం మొదలయ్యింది.

 Bigg Boss 5 Telugu Ticket To Finale Winner Sreerama Chandra Will Be The First Finalist-TeluguStop.com

బిగ్ బాస్ ఫీనాలేకి వెళ్లే తొలి కంటెస్టెంట్ ఎవరో తేల్చే సమయం వచ్చేసింది.ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

టికెట్ టు పినాలే టాస్క్ లో భాగంగా నాలుగవ ఛాలెంజ్ లో ఇంటి సభ్యులు అందరూ కలసి ఏకాభిప్రాయంతో పోకస్ గేమ్ ని ఎంచుకుని బ్లూ కలర్ జెండాను ఎగరవేశారు సన్నీ.

 Bigg Boss 5 Telugu Ticket To Finale Winner Sreerama Chandra Will Be The First Finalist-మానస్ బ్యాడ్ లక్.. టికెట్ టు ఫినాలే గెలిచిన శ్రీరామచంద్ర-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ టాస్క్ లో భాగంగా పోటీదారులు సిరి,మానస్,సన్నీ, శ్రీ రామ్ లకు ఫోకస్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

నలుగురు కంటెస్టెంట్ లకు చేతికి పలకలు ఇచ్చారు.మిగిలిన కంటెస్టెంట్ లు సౌండ్ వినిపిస్తూ ఉంటే వారు అవి వేటికి సంబంధించినవో రాయాలి.

ఈ టాస్క్ ప్రారంభం అయినా తర్వాత కాజల్, ప్రియాంక, షణ్ముఖ్ లు గేమ్ నుంచి తప్పుకొని గేమ్ లో ఉన్న వారికి సలహాలు ఇస్తుండటంతో అలా చేయొద్దని బిగ్ బాస్ వారిని హెచ్చరించాడు.ఈ క్రమంలోనే కాజల్ సౌండ్స్ చేస్తున్నప్పుడు మాట్లాడుతుంటే అలా మాట్లాడవద్దని సన్నీ ఆమెకు సూచించగా ఆమె అతని మాటలు పట్టించుకోకుండా అదేవిధంగా మాట్లాడుతుండటంతో సన్నీ ఆమెపై ఫైర్ అయ్యాడు.

ఈ క్రమంలోనే సన్నీ,కాజల్ పై ఫైర్ అవుతూ ఇది టికెట్ టు ఫినాలే మజాక్ చేయొద్దు.ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో.నువ్వు చేసేది తప్పు.నాకు కోపం వస్తుంది అని బిగ్ బాస్ కి కంప్లైంట్ చేశారు సన్నీ.ఇక సిరి మాత్రం తన పని తనదే అన్నట్టుగా పక్క కంటెస్టెంట్ లు రాసింది చూసి కాపీ కొట్టింది.దీనితో బిగ్ బాస్ ఆమెకు ఝలక్ ఇస్తూ చూసి రాసినవి చెరిపేసేయ్ అంటూ హెచ్చరించాడు.

ఇలా మొత్తం టాస్క్ లో అన్నీ ముగిసేసరికి మానస్ మొదటి పొజిషన్ ల్లో  ఉండగా,  శ్రీరామ్ రెండవ స్థానంలో ఉన్నాడు.ఇక ఆఖరి టాస్క్ లో మానస్ ను ఓడించి శ్రీరామ్ టాస్క్ లో గెలిచి టికెట్ టు ఫినాలే అందుకున్నాడు.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తొలి ఫైనలిస్టుగా సత్తా చాటాడు శ్రీరామ్.

#Ticket Finale #Sri Chandra #Manas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube