నటరాజా ఇక ఇంటికి వచ్చి డాన్స్ చేసుకుందువులే

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 అప్పుడే మూడు వారాలు పూర్తి చేసుకుని నాల్గవ వారంలోకి అడుగు పెట్టింది.మొదటి మూడు వారాల్లో బిగ్ బాస్‌ ఇంటి నుండి సరయు, ఉమా దేవి మరియు లహరి లు ఎలిమినేట్‌ అయ్యి వెళ్లి పోయారు.

 Bigg Boss 5 Telugu This Week Elimination Natraj Master, Bb5, Bigg Boss 5, Natraj-TeluguStop.com

ఈ ముగ్గురి దారిలో నాల్గవ వారం తర్వాత వెళ్లి పోయేది ఎవరు అంటూ ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.నాల్గవ వారంకు గాను ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యారు.

అందులో వీక్ అంటే నటరాజ్ మాస్టర్ మరియు లోబో. వీరిద్దరు కూడా ఆట పై పెద్దగా ఆసక్తి కలిగి ఉన్నారా లేరా అనే విషయం పక్కన పెడితే సందర్బం లేకుండా.

సమయం చూసుకోకుండా ఆటను గందరగోళం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ హౌస్ లోకి వెళ్లే సమయంలో చాలా హుందాగా అందరి గౌరవంతో వెళ్లాడు.

కాని ఇప్పుడు ఇంటి సభ్యుల్లో సగం మంది ఆయన్ను కనీసం మాస్టర్ అనేందుకు కూడా ఇష్టపడటం లేదు.ఆయన తీరు ఏమాత్రం సరిగా లేదు అంటూ అంతా కూడా తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

ఈసారి బిగ్‌ బాస్ ఎలిమినేషన్ లో ఎవరు ఉంటారు అంటే నటరాజ్ మాస్టర్ ఉంటారని చాలా మంది అనుకున్నారు.సోమవారం ఎపిసోడ్‌ లో ఆయన నామినేట్‌ అయిన సమయంలోనే ఖచ్చితంగా ఆయన ఎలిమినేట్‌ అవుతాడు అనుకున్నారు.

మంగళవారం ఎపిసోడ్‌ నుండి ఆయన పద్దతి చూస్తుంటే ఇక ఆయన్ను ప్రేక్షకులు బయటకు పంపించేందుకు సిద్దం అయ్యారేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Telugu Bigg Boss, Lahari, Lobo, Nataraj Ma, Natraj Master, Sarayu, Telugu, Umade

ఒక వేళ బయటకు పంపించేందుకు గాను ఓట్లు ఉంటే ఖచ్చితంగా ఆయనకు పెద్ద ఎత్తున ఓట్లు వస్తాయేమో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.అంతగా ఆయన అంటే వ్యతిరేకత ఏర్పడింది.నామినేషన్స్ ను తీసుకోలేడు.

ఏ సమయంలో కూడా ఆయన తన ను కాస్త విమర్శిస్తే తట్టుకోలేడు.అలాంటి మనస్థత్వం ఇక్కడ పనికి రాదు కనుక మాస్టారు ఇక వెళ్లండి అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube