షణ్నుని హగ్గులతో నలిపేసిన సన్నీ.. ఓవర్ యాక్షన్ ఆపు అంటూ వార్నింగ్?

Bigg Boss 5 Telugu Sunny Imitates Shanmukh And Siri Hug Seen

బిగ్ బాస్ హౌస్ లో తాజాగా జరిగిన ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఫన్ గా నడిచింది.మొదట సూపర్ లగ్జరీ ఐటమ్స్ ఇచ్చి హౌస్ మెట్ ని సర్ప్రైజ్ చేశాడు బిగ్ బాస్.

 Bigg Boss 5 Telugu Sunny Imitates Shanmukh And Siri Hug Seen-TeluguStop.com

పానీ పూరి, పిజ్జా,బర్గర్, ఫ్రైడ్ చికెన్ లగ్జరీ ఐటమ్స్ లో ఇచ్చి ఎవరికి వారు నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలని అన్నారు.దీనికంటే ముందుగా గులాబ్ జామ్ టాస్క్ ఇచ్చి, గులాబ్ జామ్  చేతితో ముట్టుకోకుండా తినాలని ఎవరైతే ఎక్కువ తింటారో వారికి లగ్జరీ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారు.

హౌస్ లో ఒక్క సిరి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు తినలేక పోయారు.

 Bigg Boss 5 Telugu Sunny Imitates Shanmukh And Siri Hug Seen-షణ్నుని హగ్గులతో నలిపేసిన సన్నీ.. ఓవర్ యాక్షన్ ఆపు అంటూ వార్నింగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సిరి తిండి చూసి అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు.

అప్పుడు సన్ని, సిరిని నువ్వు అసలు మనిషివేనా అని అడిగాడు.బాత్రూమ్ వెళ్లి వస్తున్న సిరి ఎడమ చేతిని పట్టుకుని అతని చేతి రేకలు చూస్తుండగా.

ఇప్పుడే బాత్రూంకి పోయి వచ్చాను చూస్తావా అంటూ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చింది సిరి.దీంతో అక్కడున్నవారంతా తెగ నవ్వుకున్నారు.

ఆ తర్వాత ఎప్పటిలాగే ఈమె షణ్ముఖ్ బెడ్ పై పడుకోవడం, గుసగుసలు ఆడటం, సిరి చేతులు చాపి హాగ్ ఇవ్వడం. షణ్ముఖ నలిపివేయడం ఇలాంటి సీన్స్ జరిగాయి.

ఆ తర్వాత బిగ్ బాస్ క్యారెక్టర్స్ చేంజ్ చేసుకునే టాస్క్ ను ఇచ్చాడు.అందులో భాగంగానే సన్నిలా సిరి.షణ్ముఖ్ లా సన్నీ. కాజల్ లా శ్రీరామ్.అని మాస్టర్ లా మానస్.రవి లా కాజల్ పాత్రల్లో ఫర్ఫార్మెన్స్ ను ఇరగదీశారు.

సన్నీ షణ్ముఖ్ పాత్ర చేస్తూ సిరి పాత్రలో ఉన్న షణ్ముఖ్ ని నలిపిపడేసాడు.మాటిమాటికి హగ్ చేసుకుంటా రారా అంటూ హగ్గులతో షణ్ముఖ్ ని నలిపేసి.

ఆంటీ ఇది ఫ్రెండ్షిప్ హగ్గు అంటూ రోజు షణ్ముఖ్,సీరిలు ఎలా అయితే చేస్తారో అలా కామెడీ చేస్తున్న వాళ్లకు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు సన్నీ.పాత్ర నుంచి బయటకు రాకుండానే ఇన్ డైరెక్ట్ గా పంచులు వేస్తూనే ఉన్నాడు.

అప్పుడు షణ్ముఖ్ హే.హగ్ చేసుకోకు అని అంటుంటే సన్నీ మాత్రం ఫ్రెండ్షిప్ హాగ్.ఫ్రెండ్షిప్ హాగ్ అంటూ దుమ్ములేపేసాడు.

#Bigg Boss #BiggBoss #Sunny #ShanmukhSiri #Siri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube