బిగ్ బాస్ సీజన్ డేట్ ఫిక్స్.. లిస్ట్ ఇదే!

బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షోలో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే పలు భాషలలో ప్రసారం అవుతూ ఎంతో ఆదరణ దక్కించుకున్న ఈ కార్యక్రమానికి తెలుగులో కూడా మంచి ఆదరణ దక్కింది.

ఈ క్రమంలోనే ఇప్పటికీ నాలుగు సీజన్లలో ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 5 కు సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే నిర్వాహకులు కూడా ఏర్పాట్లను వేగవంతం చేశారు.

 Bigg Boss 5 Telugu Starting Date 2021-బిగ్ బాస్ సీజన్ డేట్ ఫిక్స్.. లిస్ట్ ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజానికి ఈ కార్యక్రమం మే నెలలోనే ప్రసారం కావాల్సిందే.అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది.అయితే ఇప్పటికే బిగ్ బాస్ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారని, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ లను జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారని, సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ షో ప్రసారం కాబోతుందని పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి వెళ్లే కంటెస్టెంట్ పలువురి పేర్లు సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే యాంకర్ వర్షిని, రవి, నటి సురేఖ, యూట్యూబ్ షణ్ముఖ, యాంకర్ శివ, హీరోయిన్ ఇషా చావ్లా, యాంకర్ ప్రత్యూష, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ వర్మ – విష్ణు ప్రియ జంట, శేఖర్ మాస్టర్, లోబో, బుల్లితెర నటి నవ్య స్వామి, సింగర్ మంగ్లీ వంటివారు ఈ లిస్టులో ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ కంటెస్టెంట్ లిస్ట్ లో నుంచి మంగ్లీ తప్పుకున్నట్లు తెలుస్తోంది.తాజాగా బోనాల ప్రత్యేక పాట పాడిన సందర్భంగా జరిగిన వివాదం కారణంగా ఈమె బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి దూరంగా ఉంటున్నారని, ఈమెని ఎలాగైనా ఒప్పించి కార్యక్రమానికి తీసుకురావాలనే ఆలోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.

#Anchor Ravi #Surkha Vani #Navya Swami #Bigg Boss #Season 5

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు