ఎట్టకేలకు ఒక్క ఆటలో గెలిచిన షణ్ముఖ్.. ఆనందంలో?

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారంలో భాగంగా నామినేషన్ ప్రక్రియ జరిగిపోయింది.ఇక పోతే ఈ వారంలో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇంటిని లాక్ డౌన్ చేసినట్లు ప్రకటించారు.

 Bigg Boss 5 Telugu Siri Shanmukh Sriramachandra Are Win Captaincy Contender Task-TeluguStop.com

ఈ క్రమంలోనే హౌస్ సభ్యులందరినీ గార్డెన్ లోకి పంపించి అభయహస్తం అనే టాస్క్ పెట్టారు.ఈ టాస్క్ లో గెలిచిన వారు మాత్రమే హౌస్ లోకి వెళ్ళడానికి అర్హత ఉంటుందని చెప్పారు.

అయితే ఈ వారం కెప్టెన్స్ గా ఎన్నిక అవ్వాలంటే 5 పోటీ ఛాలెంజ్ ఎదుర్కోవాలని బిగ్ బాస్ హౌస్ సభ్యులకు సూచించారు.అయితే ఇందులో ఎవరు పోటీ పడతారని విషయం సభ్యులకే వదిలేశారు.

 Bigg Boss 5 Telugu Siri Shanmukh Sriramachandra Are Win Captaincy Contender Task-ఎట్టకేలకు ఒక్క ఆటలో గెలిచిన షణ్ముఖ్.. ఆనందంలో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే హౌస్ సభ్యులందరూ ఇప్పటివరకు కెప్టెన్సీ టాస్క్ అర్హత సాధించని షణ్ముఖ్, లోబోలను ఎంపిక చేశారు.ఈ క్రమంలోనే ఒక బాత్ టబ్ లో ఆవుపేడ, మట్టి, ముత్యాలు వేసి అందులో ఎవరు ఎక్కువ ముత్యాలను కలెక్ట్ చేస్తే వారే విజేతలని ప్రకటించాడు.

అయితే ఒక్కోసారి కేవలం ఒక్కో ముత్యం మాత్రమే తీయాలని కండిషన్ పెట్టాడు.ఇలా షణ్ముఖ్ లోబో మధ్య గట్టి పోటీ ఏర్పడింది.ఈ క్రమంలోనే ఈ టాస్క్ లో భాగంగా షణ్ముఖ్ ఏకంగా 101 ముత్యాలను తీసుకోగా లోబో 74 ముత్యాలని వెలికితీశారు

అయితే షణ్ముక్ తీసిన ముత్యాలు నీటిగా లేవంటూ రవి, విశ్వ,శ్రీ రామచంద్ర ఆరోపించగా నీట్ గా ఉన్నాయా లేవా అనేది కాదు మేటర్ ఎన్ని ఎక్కువ తీశామనేది ఇంపార్టెంట్ అంటూ సిరి వాదించింది.ఈ క్రమంలోనే సంచాలకులుగా ఉన్నటువంటి సన్నీ ఇది గమనించి ఈ టాస్క్ లో షణ్ముఖ్ విజేత అని ప్రకటించాడు.ఇలా షణ్ముక్ మొట్టమొదటిసారి కెప్టెన్సీ టెండర్ టాస్క్ లో గెలవడంతో ఒక్కసారిగా సిరి తనని హగ్ చేసుకుంది.

#Captaincy Task #Sri Ramachandra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube