సిరి షణ్నూల రిలేషన్ ను గౌరవిస్తా.. సిరి బాయ్ ఫ్రెండ్ కామెంట్స్ వైరల్!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 కంటెస్టెంట్ల ప్రవర్తన పట్ల నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.ముఖ్యంగా షణ్ముఖ్, సిరి సన్నిహితంగా మెలగడం బిగ్ బాస్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.

 Bigg Boss 5 Telugu Siri Boy Friend Comments Siri Shannu Relationship , Big Boss5-TeluguStop.com

షణ్ముఖ్ ఇప్పటికే దీప్తి సునైనాతో ప్రేమలో ఉండగా సిరికి ఇప్పటికే శ్రీహాన్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది.సోషల్ మీడియాలో సిరి, షణ్ముఖ్ పై నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతోంది.

సిరి హన్మంత్ వల్లే బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ గేమ్ ను సరిగ్గా ఆడలేకపోతున్నాడని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సిరి తల్లి సైతం సిరి షణ్ముఖ్ ను  హగ్ చేసుకోవడం తనకు నచ్చలేదని వెల్లడించారు.

సిరి షణ్నూ రిలేషన్ విషయంలో నాగార్జున వాళ్లను మందలించలేదని నాగ్ ను సైతం కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.అయితే తాజాగా సిరి షణ్నూల రిలేషన్ గురించి శ్రీహాన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందించారు.

సిరి హన్మంత్, షణ్ముఖ్ ఉంటున్న వాతావరణం అలాంటిదని సిరి తల్లికి ఏం చెప్పాలో తెలియక ఆ విధంగా చెప్పారని శ్రీహాన్ అన్నారు.సిరి హన్మంత్ గురించి సోషల్ మీడియా వేదికగా కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుంటే ఒక తల్లిగా ఆమె కూతురితో అలా అన్నారని శ్రీహాన్ పేర్కొన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఆంటీ ఆ విధంగా చెబుతారని తాను కూడా ఊహించలేదని శ్రీహాన్ చెప్పుకొచ్చారు.

Telugu Bigg Boss, Shanmukh, Siri, Siri Mother, Srihaan, Trolls-Movie

సిరి, షణ్ముఖ్ జశ్వంత్ ల రిలేషన్ ను తాను గౌరవిస్తానని శ్రీహాన్ పేర్కొన్నారు.సిరి తల్లి ఆ విధంగా కామెంట్లు చేసినందుకు ఆమెపై కోప్పడవద్దని శ్రీహాన్ కోరారు.సిరి తల్లి తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని శ్రీహాన్ చెప్పుకొచ్చారు.

శ్రీహాన్ వివరణతో సిరి తల్లికి నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్న వాళ్లు కూల్ అవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube