బిగ్ బాస్ నుంచి షణ్ముఖ్ ఔట్.. అతడు ఏం అంటున్నాడంటే?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.నిజానికి ఏ టాలీవుడ్ హీరోల పేర్లు కూడా ఇన్ని రోజులు చర్చలు జరుగుతాయో లేదో తెలియదు కానీ ఈ షణ్ముఖ్ పేరు మాత్రం బాగా వినిపిస్తుంది.

 Clarity On Shanmukh Jaswanth Bigg Boss Five Telugu Entry,  Shanmukh Jaswanth, Bi-TeluguStop.com

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన షణ్ముఖ్ మొత్తానికి ఓ సెలబ్రిటీ హోదాను అందుకున్నాడు.యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసి అతి తక్కువ సమయంలో మంచి సక్సెస్ అందుకొని యూట్యూబ్ స్టార్ గా నిలిచాడు.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక బిగ్ బాస్ లో ఇతడి ఎంట్రీ ఉంటుందని బాగా వార్తలు వినిపించాయి.

త్వరలోనే బుల్లితెరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 5 గురించి తెగ టాక్ వినిపిస్తుంది.ఈ సీజన్ ఉంటుందని ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.

ఈ సీజన్ భారీ బడ్జెట్ తో రానున్నట్లు అంతేకాకుండా ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు పేర్లు కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఇటీవలే కొందరి కంటెస్టెంట్ పేర్ల లిస్ట్ కూడా బయట పడటంతో అందులో షణ్ముఖ్ పేరు కూడా ఉంది.

దీంతో షణ్ముఖ్ అభిమానులు ఇతడి ఎంట్రీ ఉంటుందని తెలిసేసరికి తెగ ఆరాటపడ్డారు.కానీ ప్రస్తుతం ఇతడి ఎంట్రీ డౌట్ గానే అనిపిస్తుంది.

Telugu Bigg Boss, Crore, Rumours-Movie

కొన్ని రోజుల నుండి ఇతనికి బిగ్ బాస్ యాజమాన్యం కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ తాజాగా అతడికి అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి బిగ్ బాస్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో.షణ్ముఖ్ అడిగిందంట ఇవ్వకపోతే బిగ్ బాస్ సీజన్ లోకి రానని అన్నట్లు బెట్టు చేశాడు అన్నట్లు తెలిసింది.ఈ విషయం గురించి వెంటనే స్పందించిన షణ్ముఖ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.

Telugu Bigg Boss, Crore, Rumours-Movie

అందులో తను.నెగిటివ్ కామెంట్లు తనకు కొత్త కాదు అంటూ.రాసే వాళ్లను రాయనివ్వండి అంటూ తెలిపాడు.అంతే కాకుండా తను చెప్పే వరకు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని తెలియజేసేసరికి.ఇంతకీ తన ఎంట్రీ ఉంటుందా లేదా అని అర్థం కాని పరిస్థితిగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube