ఏదైనా చేస్తేనే వాల్యూ.. కాజల్ భర్త కామెంట్స్ వైరల్?

తాజాగా జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఎమోషనల్ గా సాగింది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్కాజల్ భర్త అలాగే ఆమె కూతురు హౌస్ లోకి వచ్చారు.

 Bigg Boss 5 Telugu Rj Kajal Husband Vijay Seelamsetty Valuable Suggestions-TeluguStop.com

ఈ క్రమంలోనే కాజల్ భర్త ఆమెకు బయట పరిస్థితుల గురించి ఆమె అడ్డుకున్న తీరు గురించి కొన్ని సలహాలు ఇచ్చారు.అలాగే కాజల్ ఆమె భర్త విజయ్ మధ్య కొద్దిసేపు ఆసక్తికరమైన చర్చ నడిచింది.

అప్పుడు కాజల్ మాట్లాడుతూ.నామీద నాకే డౌట్ వస్తుంది.

డౌన్ అయిపోతానేమో అని అనిపిస్తుంది,గెలవలేకపోయాను అని కాజల్ చెప్పగా తన భర్త తనకు ధైర్యం చెప్పారు.

భర్త విజయ్ మాట్లాడుతూ.ఒకటి చెప్తా విను ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు.100 పర్సంట్ ఎఫర్ట్ పెడుతున్నావ్.బిగ్ బాస్ అనేది టాస్క్‌లకు సంబంధించిన ఆట కాదు.ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు.రిజల్ట్ ఏదైతే అది అవుతుంది.నువ్వు కెప్టెన్ ఎందుకు కాలేకపోయావనేది నీకు తెలుసు నాకు తెలుసు.యు ఆర్ ఎలోన్ ఫైటర్.సపోర్ట్ లేకుండా ఎవరూ ఆడలేదు.నువ్ వచ్చావ్.ఇన్నిరోజులు హౌస్‌లో ఉన్నావ్.

ఇంకా హౌస్‌లో ఉంటావ్.అది గ్రేట్ అచీవ్‌మెంట్‌గా ఫీల్ అవ్వు అంటూ విజయ్ కాజల్ కి ధైర్యం చెప్పాడు.

Telugu Bigg Boss, Biggboss, Biggboss Telugu, Kajal, Vijay-Movie

నువ్ గేమ్ ఆడటానికి వచ్చావ్.అదే చేయి.నువ్ బయటకు వచ్చేటప్పుడు ఏదైనా పీకి వస్తేనే దానికి వాల్యూ ఉంటుంది.

డే వన్ నుంచి సోలో ఫైట్ చేస్తున్నావ్ఇప్పుడు కూడా అలాగే ఆడు.గ్రూప్‌గా ఆడమని నేను చెప్పను.యు ఆర్ కాజల్.అది గుర్తుపెట్టుకో.నువ్ స్ట్రాంగ్‌గా ఉండు.మేం గుర్తుకు వస్తే లెటర్ తీసి చదువుకో.

నేను చెప్పినవి బాగా గుర్తుపెట్టుకో’ అని చెప్పాడు కాజల్ భర్త విజయ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube