బిగ్ బాస్ పత్తి వ్యాపారం.. రవి, లోబో, శ్వేతా అదిరిపోయే గేమ్?

బిగ్ బాస్ కార్యక్రమం 5 వారాలు పూర్తి చేసుకొని సోమవారం నామినేషన్ ప్రక్రియలో ఎంతో రసవత్తరంగా కొనసాగాయి.నామినేషన్ ప్రక్రియలో భాగంగా పలువురు కంటెస్టెంట్ ల మధ్య గొడవలు తలెత్తినట్లు తెలుస్తోంది.

 Bigg Boss 5 Telugu Ravi Lobo And Shweta Hit Jackpot Captaincy Contender Task-TeluguStop.com

ఇలా నామినేషన్ల గురించి చర్చ మొదలైన తర్వాత ఈ వారం కెప్టెన్సీ టాస్క్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ బీబీ బొమ్మల ఫ్యాక్టరీ అనే గేమ్‌ ఇచ్చాడు.

ఈ గేమ్ లో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నాలుగు భాగాలుగా విడిపోతారు.

 Bigg Boss 5 Telugu Ravi Lobo And Shweta Hit Jackpot Captaincy Contender Task-బిగ్ బాస్ పత్తి వ్యాపారం.. రవి, లోబో, శ్వేతా అదిరిపోయే గేమ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బ్లూ టీమ్ లో మానస్, సన్నీ, అనీ మాస్టర్ ఉండగా ఎల్లో టీమ్ లో షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ ఉన్నారు.

ఇక గ్రీన్ టీమ్ లో రవి, శ్వేత లోబో ఉండగా, రెడ్ టీమ్ లో విశ్వ, ప్రియా, శ్రీరామ్ ఉన్నారు.మిగిలిన సిరి కాజల్ ఇద్దరిని ఫ్యాక్టరీ మేనేజర్ గా సంచాలకులుగా ఉండాలని బిగ్ బాస్ సూచించారు.

ఈ క్రమంలోనే రెడ్ అండ్ గ్రీన్ టీమ్ లకు మేనేజర్ గా సిరి ఉండగా ఎల్లో అండ్ బ్లూ టీమ్ కి కాజల్ మేనేజర్ గా వ్యవహరించారు.ఈ క్రమంలోనే ఈ బొమ్మలు తయారు చేయడానికి కావలసిన మెటీరియల్ గార్డెన్లో ఉందని బిగ్ బాస్ సూచించారు.

Telugu Bigg Boss Telugu 5, Lobo, Ravi, Swetha-Movie

ఇలా ఎవరైతే నాణ్యతగల బొమ్మలను ఎక్కువ చేస్తారో వాళ్ళ టీం సభ్యులకు మేనేజర్ కు కెప్టెన్ అవకాశం ఉంటుందని చెప్పారు.దీంతో బొమ్మలలో పత్తి సరిగా పెట్టకపోతే ఇదొక పత్తి వ్యాపారం.పత్తి లేకపోతే బొమ్మలను రిజెక్ట్ చేస్తున్నారు అంటూ మానస తనదైన శైలిలో పంచ్ వేశాడు.ఈ టాస్క్ లో భాగంగా గ్రీన్ టీమ్ లో ఉన్న లోబో, రవి, శ్వేతాలకు బంపర్ ఆఫర్ తగిలింది.

ఇందులో భాగంగా వీరికి స్పెషల్ బొమ్మ రావడంతో దాని ద్వారా వీరు ఎవరి దగ్గర ఉన్న బొమ్మలు నైనా తీసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు.

#Swetha #Ravi #Lobo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు