టాప్ 5 లో నేను, మానస్ కచ్చితంగా ఉంటాం.. జోష్యం చెప్పిన ప్రియాంక?

Bigg Boss 5 Telugu Promo Contestants Are Full Fun Mood

బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ఏడువారాలను పూర్తి చేసుకుని ఎనిమిదవ వారంలోకి అడుగుపెట్టింది.ఈ క్రమంలోనే 8వ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తవ్వగానే ఎప్పటిలాగే హౌస్ సభ్యులందరూ ఎంతో సరదాగా సంతోషంగా మాటలు పెట్టుకున్నారు.

 Bigg Boss 5 Telugu Promo Contestants Are Full Fun Mood-TeluguStop.com

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత మానస్, పింకీ ఎంతో చనువుగా ఉండటం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో భాగంగా పింకీ మానస్ ఇద్దరూ మాట్లాడుతూ.

టాప్ ఫైవ్ లో నేను మానస్ కచ్చితంగా ఉంటామని ప్రియాంక జోస్యం చెప్పింది.ఇలా ప్రియాంక చెప్పిన మాటలకు సిరి తనదైనశైలిలో కౌంటర్ వేసింది.

 Bigg Boss 5 Telugu Promo Contestants Are Full Fun Mood-టాప్ 5 లో నేను, మానస్ కచ్చితంగా ఉంటాం.. జోష్యం చెప్పిన ప్రియాంక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీరిద్దరూ టాప్ ఫైవ్ లో ఉంటే మేమందరం అడుకు తినాలా అంటూ ప్రశ్నించింది.ఇక మానస్ కలుగజేసుకొని హౌస్ నుంచి అంకుల్స్ అందరూ బయటకు వెళ్తే కేవలం కుర్రాళ్ళందరూ హౌస్ లో ఉండాలని తను భావిస్తున్నట్లు తెలియజేశారు.

ఇలా మానస్ చెప్పగా సిరి మరోసారి మాట అందుకొని ఆంటీలు బయటకు వెళ్లాల్సి వస్తే ముందు ప్రియాంక బయటకు వెళ్తుంది అంటూ సెటైర్ వేస్తుంది.ఈ మాటకు ప్రియాంక మాట్లాడుతూ మొహం పగిలిపోతుంది అంటూ సిరి పై కౌంటర్ వేసింది.

ఇలా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ ఒకదగ్గర చేరి ఎంతో సరదాగా ముచ్చటించారు.ఈ క్రమంలోనే రవి షణ్ముఖ్, జెస్సీ, సిరి గురించి కామెంట్ చేశారు.ఇకపోతే ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ ను లాక్ డౌన్ చేసినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో అందరిని గార్డెన్ ఏరియాలోకి పంపించి అభయ హస్తం అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చినట్లు సమాచారం.

మరి ఈ టాస్క్ లో ఎవరు పాల్గొనబోతున్నారు ఎవరు గెలుస్తారు అనే విషయాల గురించి నేటి ఎపిసోడ్ లో తెలియాల్సి ఉంది.

#Priyanka Singh #Bigg Boss #Bigg Boss #Captaincy Task #Manas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube