నాలుగు వారాలకు నటరాజ్ మాస్టర్ రెమ్యునరేషన్ ఎంతంటే?

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ 5 రోజురోజుకు విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది.19 మంది కంటెస్టెంట్ లతో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం నాలుగు వారాలు పూర్తి చేసుకొని ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది.ఈ క్రమంలోనే ప్రతి వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతుండగా నాలుగవ వారం నటరాజ్ మాస్టర్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.ఈ క్రమంలోనే హౌస్ లో 15 మంది కంటెస్టెంట్ లు తమదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

 Bigg Boss 5 Telugu Natraj Master Remuneration Four Weeks Bigg Boss Telugu 5, Nat-TeluguStop.com

ఇక గత వారం హౌస్ నుంచి నటరాజు మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు.హౌస్ లో ఉన్నన్ని రోజులు అందరితో ఎంతో కలివిడిగా ఉంటూ…అందరితో మంచిగా మెలిగిన మాస్టర్ చివరి వారం హౌస్ లో ఉన్న సభ్యులందరినీ జంతువులతో పోలుస్తూ తనదైన శైలిలో అందరిని కామెంట్లు చేయడం వల్ల మాస్టర్ పై నెగిటివిటీ ఏర్పడి అతను హౌస్ నుంచి బయటకు రావడానికి కారణం అయింది.

అయితే నాలుగు వారాలకు గాను నటరాజ్ మాస్టర్ కు బిగ్ బాస్ నుంచి ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారనే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

Telugu Bigg Boss, Eliminate, Weeks, Natarj Master-Movie

ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు నటరాజ్ మాస్టర్ కు ప్రతి రోజుకు 15 వేల చొప్పున రెమ్యూనరేషన్ చెల్లిస్తామని డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.ఈ ప్రకారం నట్రాజ్ మాస్టర్ వారానికి లక్ష రూపాయల దాకా రెమ్యూనరేషన్ పొందారని నాలుగు వారాలకు గాను నాలుగు లక్షలు తీసుకున్నట్లు సమాచారం.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధానాన్ని బట్టి మరింత ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తున్న నటరాజ్ మాస్టర్ ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మాస్టర్ ఒకవైపు బాధగా ఉన్న మరో వైపు తన భార్య గర్భవతిగా ఉండడంతో బయటకు వెళ్లడం సంతోషంగానే ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube