జెస్సికి సీక్రెట్ టాస్క్.. సన్నితో దారుణమైన గొడవలు.. కారణం అదే?

Bigg Boss 5 Telugu Latest Promo Secret Task Jessie

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు, పోట్లాటలు, ప్రేమానురాగాలు ఇలా ఎప్పుడు ఎవరి మధ్య ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.అప్పటి వరకు ఎంతో కలిసిమెలిసి ఉండే కంటెస్టెంట్ లు కూడా ఉన్నఫలంగా శత్రువులుగా మారిపోతున్నారు.

 Bigg Boss 5 Telugu Latest Promo Secret Task Jessie-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటున్నారు.తాజాగా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బంగారు కోడిపెట్ట టాస్క్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ టాస్క్ లో గెలవడం కోసం ప్రతి ఒక్కరు కంటెస్టెంట్ ఎంతో కష్టపడుతున్నారు.

 Bigg Boss 5 Telugu Latest Promo Secret Task Jessie-జెస్సికి సీక్రెట్ టాస్క్.. సన్నితో దారుణమైన గొడవలు.. కారణం అదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ టాస్క్ లో భాగంగా ఎవరివైనా ముగ్గురు గుడ్లను దొంగతనం చేస్తే తనకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించారు.అయితే ఈ టాస్క్ లో భాగంగా ఎవరైనా సహాయం తీసుకోవచ్చని బిగ్ బాస్ చెప్పడంతో జెస్సి సిరి హెల్ప్ తీసుకున్నారు.

ఇలా సీక్రెట్ టాస్క్ లో భాగంగా జెస్సీ సన్నీని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.కావాలనే సన్నీని రెచ్చగొడుతూ అతనితో గొడవకు దిగారు.అయితే ఇది సీక్రెట్ టాస్క్ అని తెలియని సన్నీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ టాస్క్ లో భాగంగా సిరి కూడా సన్నీతో గొడవ పడుతూ నీకెందుకురా అంటూ మాట్లాడుతుంది.రా అన్నావంటే బాగోదు నీకు ఆ అర్హత లేదని సన్నీ అనడంతో అర్హత ఏంటి అంటూ వీరిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంటుంది.ఇకపోతే బిగ్ బాస్ ఇదొక సీక్రెట్ టాస్క్ అని అసలు విషయం చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ షాక్ అయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న షణ్ముక్ అప్పుడప్పుడు నాకు కూడా సీక్రెట్ ఇవ్వండి బిగ్ బాస్ అని అనడంతో వెంటనే రవి ముందు టాస్క్ ఆడురా అంటూ సెటైర్ వేశాడు.మరి ఈ సీక్రెట్ టాస్క్ లో జెస్సీ విజయం సాధించాడా లేదా అనే విషయం నేటి ఎపిసోడ్ లో తెలియనుంది.

#Jessie #Bigg Boss #JessiePadala #Promo #Bigg Boss Promo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube