బిగ్ బాస్ సీజన్ 5 లో పాపులర్ సింగర్.. ఎవరంటే..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.స్టార్ మా ఛానెల్ లో ఇప్పటివరకు నాలుగు సీజన్లు ప్రసారం కాగా ఒక సీజన్ ను మించి మరో సీజన్ సక్సెస్ అయ్యాయి.

 Bigg Boss 5 Telugu Hema Chandra Likely Participate Show, Hema Chandra, Bigg Bos-TeluguStop.com

గతేడాది కరోనా, లాక్ డౌన్ ఇతర కారణాల వల్ల సీజన్ 4 ఆలస్యంగా ప్రసారం కాగా బిగ్ బాస్ సీజన్ 5ను త్వరగా ప్రసారం చేస్తే బాగుంటుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అయితే బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 5 కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టారని తెలుస్తోంది.

ప్రతి సీజన్ లో ఒక సింగర్ ఉండే విధంగా జాగ్రత్త పడుతున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సీజన్ లో ప్రముఖ సింగర్ హేమచంద్రను తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను పాడిన హేమచంద్రకు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే హేమచంద్రకు గతంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా ఆ షోలో పాల్గొనటానికి నో చెప్పినట్టు ప్రచారం జరిగింది.

Telugu Bb Show, Bigg Boss, Biggboss, Hema Chandra, Hema Chandra Bb, Nagarjuna, I

బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే ఛాన్స్ వస్తే హేమచంద్ర ఆ ఆఫర్ కు ఓకే చెబుతారో లేదో తెలియాల్సి ఉంది.హేమచంద్రకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.బిగ్ బాస్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అవకాశాలు పెరుగుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లలో చాలామంది వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు.

మోనాల్ కు సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వస్తుండగా అవినాష్ కామెడీ షోలతో బిజీ అయ్యాడు.

సోహెల్ హీరోగా ఒక మూవీ షూటింగ్ ప్రారంభమైంది.అఖిల్ మోనాల్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తుండగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ సినిమాలో అఖిల్ కు ఛాన్స్ దక్కినట్టు ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube