బిగ్ బాస్ 5 షో లీక్స్.. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే షణ్ముఖ్ జస్వంత్‌పై నాగ్ అలాంటి కామెంట్స్!

గత కొన్ని రోజుల నుండి బుల్లితెరలో ప్రసారం కానున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి తెగ ఎదురు చూస్తున్నారు బుల్లితెర అభిమానులు.ఇక మొత్తానికి వారి ఎదురు చూపులు ఈరోజుతో ముగియనుండగా.

 Bigg Boss 5 Telugu Grand Lauch Today Shanmukh Entry,  Bigg Boss 5 Telugu,bigg Bo-TeluguStop.com

ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ షో లాంచ్ కానుంది.పైగా ఈ షో ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది.

ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ ల పేర్ల నుండి ప్రతి ఒక్క విషయం తెగ వైరల్ గా మారగా.తాజాగా ఇందులో మరికొన్ని లీక్స్ బయటికి వచ్చాయి.

ఇప్పటికే ఈ షోలో పలువురు కంటెస్టెంట్ లు పాల్గొంటున్నారని సోషల్ మీడియాలో పేర్లు కూడా వినిపించాయి.అందులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, యాంకర్ రవి, యానీ మాస్టర్, బుల్లితెర నటి ప్రియా, నటరాజ్ మాస్టర్, మరో నటి శ్వేతా వర్మ, లహరి, ఆర్ జె కాజల్, బుల్లి తెర నటుడు మానస్, యూట్యూబ్ బోల్డ్ బ్యూటీ సరయు పాల్గొననున్నారని తెలిసింది.

ఈసారి భారీ బడ్జెట్ తో ఈ షోను ప్రారంభించనున్నట్లు తెలిసింది.ఇక ఇందులో కంటెస్టెంట్ ల ఎంట్రీ పర్ఫామెన్స్ లు కూడా ఉంటాయన్న సంగతి తెలిసిందే.

Telugu Bigg Boss Final, Igg Boss Telugu, Mahesh, Nagarjuan, Nagarjuna, Shanmukh-

దీంతో తాజాగా షణ్ముఖ్ జస్వంత్ ఎంట్రీ గురించి కొన్ని లీక్స్ బయటికి వచ్చాయి.అందులో షణ్ముఖ్ జస్వంత్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాలోని హూ ఆర్ యు అనే సాంగ్ తో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది.ఇక ఈ పర్ఫామెన్స్ అనంతరం నాగార్జున షణ్ముఖ్ తో ఆ సినిమాలోని ‘ఏంట్రా ఇది’ అనే డైలాగ్ ను వేసినట్లు తెలిసింది.అంతేకాకుండా మరికొందరు కంటెస్టెంట్ ల ఎంట్రీ కూడా బాగా సందడిగా ఉంటుందని తెలుస్తుంది.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube