దుబాయ్ లో చార్టెడ్ ఫ్లైట్, అపార్ట్మెంట్లు.. అబ్బో హామీదా?

Bigg Boss 5 Telugu Fame Hameeda About Her Life Style

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ రోజురోజుకు రసవత్తరంగా కొనసాగుతోంది.కాగా ఇటీవలే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హమీదా సరదాగా కొన్ని ముచ్చట్లు ఇంటర్వ్యూలో పంచుకుంది.

 Bigg Boss 5 Telugu Fame Hameeda About Her Life Style-TeluguStop.com

హమీదా అంటే ఎవరు అని తెలియడానికి పోర్ట్ పోలియో చేయించుకున్నాను అని స్వయానా ఆమె నోటితోనే చెప్పారు.దాన్ని పంపించిన తర్వాత తన మేనేజర్ వచ్చి ఇలా ఒక షో ఉందని తనకు చెప్పినట్టు హమీదా తెలిపారు.

అది ఏం షో అంటే అదే బిగ్ బాస్ అని ఆయన చెప్పినట్టు ఆమె అన్నారు.ఇక బిగ్ బాస్ నుంచి పిలుపు రాగానే చాలా ఎక్సైట్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.

 Bigg Boss 5 Telugu Fame Hameeda About Her Life Style-దుబాయ్ లో చార్టెడ్ ఫ్లైట్, అపార్ట్మెంట్లు.. అబ్బో హామీదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పటివరకు తనకొక ఫీలింగ్ ఉండేదని అది ఎలా అంటే బిగ్ బాస్ అంటే ఎప్పటి నుంచో సెలబ్రిటీలగా ఉన్నవాళ్లు మాత్రమే ఆ షో వెళ్తారనుకునేదాన్ని అని హమీదా చెప్పారు.

Telugu Bigg Boss, Bigg Boss Telugu 5, Hameeda, Life Style, Photoshoot, Tollywood-Movie

నిజానికి తాను ఏదైనా సినిమాల్లో అవకాశం వస్తుందేమోనని అలా ఫోటోషూట్ చేయించుకున్నాను అని చెప్పారు దాన్ని చూడగానే ఇలా ఆ షో నుంచి పిలుపు వచ్చిందని ఆమె అన్నారు నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని ఆమె అన్నారు.ఒకవేళ తాను సినిమా చేసినా కూడా హమీద ఏంటో తెలియక పోయేదని బిగ్ బాస్ కి వెళ్ళాను కాబట్టి హమీద ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.దానికిగాను బిగ్ బాస్ కు స్టార్ మాకు నాగార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఆమె చెప్పారు.

Telugu Bigg Boss, Bigg Boss Telugu 5, Hameeda, Life Style, Photoshoot, Tollywood-Movie

హమీదాకు దుబాయిలో పెద్దపెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని, చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయని వస్తున్న వార్తలపై స్పందించిన ఆమె, నిజంగా అలా చూపిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.నిజంగా తన ఫ్యాన్స్ కి తనని అలా చూడాలని ఉందేమో అని, అది తొందర్లోనే నెరవేరాలని తాను కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా చెప్పారు.

#Hameeda #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube