నా జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయను.. దీప్తి సునైనా కామెంట్స్ వైరల్!

Bigg Boss 5 Telugu Deepthi Sunaina Reacton Shanmukh Reaction Postion Hint Video

నిన్న ప్రసారమైన బిగ్ బాస్ ఎపిసోడ్ కు దీప్తి సునైనా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే.దీప్తి ఎంట్రీతో నిన్నటి ఎపిసోడ్ జాయ్‌ఫుల్‌ గా సాగింది.

 Bigg Boss 5 Telugu Deepthi Sunaina Reacton Shanmukh Reaction Postion Hint Video-TeluguStop.com

షణ్ముఖ్ తనకు ఎంతో ఇష్టమైన టీ షర్ట్ ను త్యాగం చేయడంతో మొదట షణ్ముఖ్ అన్నయ్య, తర్వాత దీప్తి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఎమోషన్స్ ను స్ట్రెంత్ గా మార్చుకోవాలని దీప్తి సునైనా షణ్ముఖ్ కు సూచనలు చేశారు.

అయితే దీప్తి సునైనా షణ్ముఖ్ తో మాట్లాడే సమయంలో మైక్ పై రెండు వేళ్లు ఉండేలా మైక్ ను పట్టుకున్నారు.

 Bigg Boss 5 Telugu Deepthi Sunaina Reacton Shanmukh Reaction Postion Hint Video-నా జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయను.. దీప్తి సునైనా కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

షణ్ముఖ్ రెండో స్థానంలో ఉన్న విషయాన్ని దీప్తి సునైనా ఈ విధంగా చెప్పారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

దీప్తి సునైనా సచ్చినోడా అని కామెంట్ చేసే సమయంలో సైగలు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.గ్రాండ్ ఫినాలేలో కలుద్దాం అంటూ దీప్తి షణ్ముఖ్ కు మరో హింట్ కూడా ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ కామెంట్ల గురించి తాజాగా దీప్తి సునైనా స్పందించి వివరణ ఇచ్చారు.

ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో తన జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయనని దీప్తి సునైనా కామెంట్లు చేశారు.

మీ బొందరా మీ బొంద అంటూ తన గురించి నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లకు దీప్తి సునైనా షాక్ ఇచ్చారు.షణ్ముఖ్ విషయంలోనే కాదని మరే విషయంలో అయినా తాను అలాంటి పనులు చేయనని దీప్తి సునైనా చెప్పారు.తన దృష్టిలో బిగ్ బాస్ 5 విన్నర్ షణ్ముఖ్ అని ఆమె కామెంట్లు చేశారు.

మరి దీప్తి సునైనా ఊహించిన విధంగా షణ్ముఖ్ బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తారో లేదో చూడాల్సి ఉంది.వీజే సన్నీ షణ్ముఖ్ కు గట్టి పోటీ ఇస్తున్నారు.మరో మూడు వారాల్లో బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే జరగనుండగా ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాల్సి ఉంది.

#DeepthiSunaina #Nagarjuna #Bigg Boss #Hint #Deepti Sunaina

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube