పవన్ కళ్యాణ్ వల్లే అలాంటి నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్ జెస్సీ?

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కాగా.బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఈ షోను ఆసక్తిగా చూస్తున్నారు.

 Bigg Boss 5, Jessie, Pawan Kalyan, Model,social Media,interview-TeluguStop.com

ఇందులో చాలా వరకు తెలిసిన సెలబ్రిటీలే ఎంట్రీ ఇవ్వగా.స్పెషల్ అట్రాక్షన్ గా మోడల్ జశ్వంత్ అలియాస్ జెస్సీ ఎంట్రీ ఇచ్చాడు.

దీంతో ఇతను ఎవరా అని తెగ సెర్చ్ లు చేశారు నెటిజన్లు.ఇతను చూడటానికి చాలా సైలెంట్ గా, అమాయకత్వం గా కనిపించగా మొదటిసారి అతడిని చూసి అమాయకుడు అనుకున్నారు ప్రేక్షకులు.

కానీ తర్వాత రోజు మామూలోడు కాదని అనుకున్నారు.ఇదిలా ఉంటే ఈయన పవన్ కళ్యాణ్ వల్ల ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

ప్రస్తుతం ఈయన గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి.అసలు ఇతను ఎవరు అని.ఎక్కడి నుండి వచ్చాడని.ఇంతవరకు ఎక్కడా చూడలేము అంటూ కామెంట్లు చేయగా.

మొత్తానికి ఈయనకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.అందులో తను కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.

ఇక ఈయనకు చిన్నప్పటినుంచి నటన పట్ల ఆసక్తి ఉందని తెలిపాడు.

Telugu Bigg Boss, Jessie, Pawan Kalyan-Movie

అది కూడా పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో పవన్ నటనను చూసి ఫిదా అయ్యానని తెలిపాడు.ఇక తనకు ఆ సినిమాలో పవన్ చేసిన మార్షియల్ బాగా ఆసక్తిగా అనిపించిందని.ఇక తను కూడా పవన్ ను చూసి కరాటి నేర్చుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపాడు.

తను కరాటే నేర్చుకున్నాక చాలా రిహార్సల్స్ చేశానని ఇప్పుడు చేయడం లేదని తెలిపాడు.ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో అడుగు పెట్టి తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకున్నాడు.

ఇక ఈయన కూడా ఎలిమినేషన్ లిస్టులో చేరిన సంగతి తెలిసిందే.మరి ఈ వారం ఇతడు బిగ్ బాస్ హౌస్ లో ఉంటాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube